నాగచైతన్య కాబోయే భార్యను గెలికిన టాలీవుడ్ హీరో?
అయితే ఈ వార్తలపై నాగచైతన్య కానీ, శోభిత ధూళిపాళ్ల కానీ ఎప్పుడూ స్పందించలేదు. చాలా సీక్రెట్ గా వీరి లవ్ రిలేషన్ కొనసాగించిన ఈ జంట కుటుంబ సభ్యులను ఒప్పించి ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఇక వీరి వివాహం త్వరలోనే జరగనుంది. శోభిత హీరోయిన్గా తన అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా శోభిత మేజర్ సినిమాలో ఓ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాలో అడవి శేషు హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ హీరో మహేష్ బాబు తన సొంత బ్యానర్ లో నిర్మించారు.
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో శోభిత పాల్గొన్నారు. అందులో భాగంగా శోభిత ఇంగ్లీషులో మాట్లాడడం జరిగింది. ఇక అక్కడ ఉన్న మహేష్ బాబు కలగజేసుకొని శోభిత తెలుగులో మాట్లాడవా ప్లీజ్ అని సెటైర్ వేశారు. దాంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. ఇక కాస్త ఫీల్ అయినా శోభిత దానిని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక తన బ్యాక్ గ్రౌండ్ మొత్తం బయటపెట్టేసింది. నేను తెలుగు అమ్మాయిని.... కానీ నాకు తెలుగు లో మాట్లాడడం పెద్దగా రాదని చెప్పింది.
శోభితను కించపరచాలనే ఉద్దేశంతో మహేష్ బాబు అలా అనలేదు. సాధారణంగానే మహేష్ బాబు జోక్స్ వేస్తారు. కాస్త ఫన్నీగానే శోభితకి కూడా అలా చెప్పడం జరిగింది. ఇక అది మేజర్ మూవీ తెలుగు వెర్షన్ ప్రమోషన్ ఈవెంట్ కావడంతో మహేష్ బాబు శోభితకు తెలుగులో మాట్లాడమంటూ సూచించాడు. దీనిపై పలువురు నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది.