మీడియాలో ఆ వార్తలు చూసి భరించలేకపోయానంటోన్న మలైకా అరోర

frame మీడియాలో ఆ వార్తలు చూసి భరించలేకపోయానంటోన్న మలైకా అరోర

Suma Kallamadi
సోషల్ మీడియాలో ఎప్పుడూ వార్తల్లో నిలిచే సెలబ్రిటీలల్లో బాలీవుడ్ భామ మలైకా అరోరా కూడా ఒకరు. ఈ బ్యూటీ ఎప్పుడూ గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉండటమే కాకుండా డేటింగ్ వార్తలతో హెడ్ లైన్స్‌లో నిలుస్తుంటారు. నెట్టింట మలైకా అరోరా గురించి హీటెక్కించే ఘాటైన వార్తలు వైరల్ అవుతుంటాయి. ఇటువంటి వార్తలపై తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. సోషల్ మీడియాలో తన గురించి అసహ్యకరమైన హెడ్ లైన్స్ చదివి మానసికంగా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. అర్జున్ కపూర్ నుంచి విడిపోయిన తర్వాత మలైకా అరోరా మరోసారి వార్తల్లో నిలిచారు. కొన్ని సార్లు తన గురించి అసహ్యకరమైన వార్తలు రాసినప్పుడు అది చూసి ఆ రోజంతా తాను గందరగోళానికి గురయ్యేదాన్నని చెప్పుకొచ్చింది. కానీ దాన్ని తట్టుకునే శక్తి తనకు ఉందని మలైకా తెలిపింది. యోగా, ధ్యానం చేయడంతో పాటు సమయానికి భోజనం చేసి నిద్రపోతానని, వాటివల్లే తానెంతో దృఢంగా ఉన్నట్లు చెెప్పింది. తాను స్ట్రాంగ్‌గా ఉండేందుకు యోగానే కారణమని స్పష్టం చేసింది.
మలైకా అరోరా తన 48 ఏళ్ల వయసులో కూడా ఫిట్ నెస్‌తో పాటు ప్రత్యేక స్టైల్‌ను కూడా మెయింటెయిన్ చేస్తున్నారు. ఆ విషయంలో కూడా ఆమెను అభినందించేవారు చాలా మంది ఉన్నారు. 48 ఏళ్ల వయసులో మరింత హాట్‌గా ఉన్నారంటూ ఎవరైనా చెబుతుంటే తనకు ఆనందం వేస్తుందని, ఆ ఆనందం వల్ల బ్యాడ్ కామెంట్స్‌ను పట్టించుకోనని ఆమె తెలిపింది. అర్జున్ కపూర్‌తో విడిపోయిందనే పుకార్లు మొదలయ్యాక మలైకా మానసిక స్థితి దారుణంగా మారింది.
తన బర్త్ డే వేడుకలకు అర్జున్ అటెండ్ కాకపోవడం మరింత బాధను కలిగించిందని మలైకా తెలిపింది. అయితే తన జీవితంలో తన గురించి ఆలోచించడం ఎంత ముఖ్యమే ఇతరులను కంట్రోల్ చేయకూడదనే విషయం కూడా ముఖ్యమని మలైకా తేల్చి చెప్పింది. ప్రతి ఒక్కరూ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోవాలని సూచించింది. రాత్రిల్లో డ్యాన్స్ చేయడం, ఉదయాన్నే యోగా చేయడం, గ్రీన్ జ్యూస్ తాగడం, సలాడ్ తినడం, చెప్పులు లేకుండా నడవడం లాంటివి తన సొంత నియమాలని, వాటి వల్లే తన జీవితం స్ట్రాంగ్‌గా ఉందని మలైకా అరోరా ఓ నోట్ ద్వారా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: