NBK109 : బాలయ్య మూవీపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు బాబీ..!!

frame NBK109 : బాలయ్య మూవీపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు బాబీ..!!

murali krishna
బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సినిమాల్లోబ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ కొట్టారు. రాజకీయాల్లో బ్యాక్ టు బ్యాక్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య నిర్మాణంలో బాలకృష్ణ 109వ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే NBK 109 సినిమా రెండు గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ తో మరోసారి బాలయ్య మాస్ సినిమాతో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల ఎన్నికల సమయంలో బాలయ్య షూటింగ్స్ కి కొంచెం గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు బాలయ్య డేట్స్ ఇవ్వడంతో శరవేగంగా NBK 109 సినిమా షూట్ జరుగుతుంది.ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రంలో ఊర్వశి రౌతేలా హీరోయిన్‌గా నటిస్తుంది. అలానే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. థమన్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత బాబీ కొల్లి తీస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.ఇక తాజాగా జైపూర్ లో చిత్రీకరించిన ఫైట్ సీన్స్ షూటింగ్ పూర్తయినట్లు బాబి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఆయన ఎప్పుడూ ఒకే ఎనర్జీతో ఉంటారని మోస్ట్ పవర్ఫుల్ సీన్స్ లో బాలయ్య ఆవేశాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు టైటిల్ టీజర్ను అతి త్వరలో రిలీజ్ చేస్తామని వెల్లడించారు.ఇక బాలయ్య కెరీర్ విషయానికొస్తే గతేడాది రెండు బ్లాక్ బస్టర్లు కొట్టేశారు బాలయ్య. ఏడాది మొదట్లో సంక్రాంతికి వీరసింహారెడ్డి చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య.. ఆ తర్వాత దసరాకి భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అనిల్ రావిపూడి తీసిన ఈ చిత్రంలో శ్రీలీల, కాజల్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీలీల.. బాలయ్యకి కూతురిగా నటించి మెప్పించింది. ఇక NBK 109తో పాటు అఖండ 2కూడా బాలయ్య చేతిలో ఉంది. అయితే ఇప్పటివరకూ అఖండ 2కి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. బోయపాటి శ్రీను మాత్రం ఇప్పటికే అఖండ 2కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: