కీర్తి సురేష్ :ఒక్కరోజైన ఆ స్టార్ హీరోలా లైఫ్ లీడ్ చేయాలనీ వుంది..!!

frame కీర్తి సురేష్ :ఒక్కరోజైన ఆ స్టార్ హీరోలా లైఫ్ లీడ్ చేయాలనీ వుంది..!!

murali krishna
మహానటి సినిమాతో భారీ హిట్ అందుకోవడంతో పాటు తెలుగులో తిరుగులేని హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తోంది. మొన్నటి వరకు పద్దతిగా కనిపించిన కీర్తిసురేష్.. ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేస్తోంది. గ్లామర్ రోల్స్ చేస్తో అభిమానులను ఆకట్టుకుంటుంది.సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఫోటోలు షేర్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవలే కీర్తిసురేష్ మెగాస్టార్ చిరంజీవి పై చేసిన కామెంట్స్ వైరల్ ఆయిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, దళపతి విజయ్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్ అంటే విజయ్ పేరు చెప్పింది కీర్తి.. దాంతో మెగా ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ అభిమానులు విజయ్ పై, కీర్తి పై ట్రోల్స్ చేశారు. తాజాగా ఎన్టీఆర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఈ వయ్యారి భామ.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ గురించి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు వేర్వేరు సందర్భాల్లో ప్రశంసల వర్షం కురిపించారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్, కీర్తి సురేష్  కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదనే సంగతి తెలిసిందే. అయితే కీర్తి సురేష్ తాజాగా ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. మొదటిసారి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  యాక్టింగ్ స్కిల్స్ గురించి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు వేర్వేరు సందర్భాల్లో ప్రశంసల వర్షం కురిపించారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

జూనియర్ ఎన్టీఆర్, కీర్తి సురేష్ కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదనే సంగతి తెలిసిందే. అయితే కీర్తి సురేష్ తాజాగా ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. మొదటిసారి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను మహానటి ఆడియో లాంఛ్ ఈవెంట్ లో చూశానని కీర్తి సురేష్ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి వర్క్ చేయాలని ఉందని కీర్తి సురేష్ వెల్లడించారు. తెరపై మా జోడీ బాగుంటుందని కీర్తి సురేష్ పేర్కొన్నారు. మహానటి సక్సెస్ సాధించిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మా టీమ్ అందరికీ పార్టీ ఇచ్చారని ఆమె వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తి అని ఎనర్జిటిక్ గా ఉంటారని కీర్తి సురేష్ పేర్కొన్నారు.ఇదిలావుంటే బన్నీకి ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. బన్నీలా నేను డ్యాన్స్ చేయాలని అనుకుంటున్నానని కీర్తి సురేష్ పేర్కొన్నారు.   ఛాన్స్ వస్తే ఒక్కరోజు బన్నీలా లైఫ్ లీడ్ చేయాలని ఉందని కీర్తి సురేష్ వెల్లడించారు.
కీర్తి సురేష్ త్వరలో రఘుతాత సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాతో కీర్తి సురేష్ ఎలాంటి ఫలితాన్ని అందుకోనున్నారో చూడాలి. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.ఇప్పటికే విడుదలైన రఘుతాత సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కీర్తి సురేష్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉంది. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ కీర్తి సురేష్ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. కీర్తి చేసిన కామెంట్లను ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తెగ వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: