జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన దేవర మూవీ నుంచి చుట్టమల్లే చుట్టేస్తాందె అంటూ సాగిపోయే సెకండ్ సింగిల్ సోమవారం (ఆగస్ట్ 5) రిలీజైన విషయం తెలిసిందే. ఈ పాటలో అందరి కళ్లూ తారక్, జాన్వీ మీద ఉండగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే లిరిక్స్, మ్యూజిక్ కూడా ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి.చుట్టమల్లె..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్, అందులోని విజువల్స్ ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు పెద్ద ట్రీట్‌లా ఉంది. ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. జాన్వీ కపూర్ అందం వావ్ అనిపిస్తోంది. ఇద్దరి జోడీ, మ్యూజిక్‌కి తగినట్లు వారు వేసిన డాన్స్ మూమెంట్స్‌తో ఇంటర్నెట్లో పాట వైరల్ అవుతోంది.బీచ్ తీరంలో ఎన్టీఆర్ డాన్స్, జాన్వీ కపూర్ గ్లామర్ అవతార్‌లో కనిపిస్తూ, వినసొంపుగా ఉన్న పాట మనసును హత్తుకుంటోంది. బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చూడటానికి సింపుల్‌గా కనిపిస్తూనే కళ్లు తిప్పుకోనీయట్లేదు. అనిరుద్ రవిచందర్ సంగీత సారథ్యంలో చుట్టమల్లె.. పాట ఈ ఏడాది బెస్ట్ మెలోడీ సాంగ్‌గా ప్రేక్షకులను మెప్పించనుంది. శిల్పా రావ్ పాటను ఎంతో శ్రావ్యంగా పాడారు. ఈ కాంబోతో పాట నెక్ట్స్ లెవల్‌కు చేరింది.తాజాగా చుట్టమల్లే పాట రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. చుట్టమల్లే పాట విడుదలైన అలాగే యూట్యూబ్‌లో టాప్ 1 ప్లేసులో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది ఈ పాట. అంతేకాకుండా "ఈ సాంగ్ మోస్ట్ అడిక్టివ్ డ్రగ్‌గా మారిపోయిందని నిరూపితమయింది" అని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. తెలుగు, తమిళ,మలయాళ,హిందీ, కన్నడ భాషల్లో కలిపి దాదాపు 65 మిలియన్ ల వ్యూస్ సాధించింది.తన కలల రాకుమారుడి కోసం ప్రతి అమ్మాయి పాడుకునేలా ఉన్న ఈ చుట్టమల్లే చుట్టేస్తాందె సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ పాటను బాలీవుడ్ సింగర్ శిల్పా రావ్ పాడగా.. రామజోగయ్య శాస్త్రి రాశాడు. ఎన్టీఆర్, జాన్వీ జోడీ తెరపై ఎంతో అందంగా కనిపిస్తోంది.ఈ సినిమా ద్వారానే తొలిసారి తెలుగులోకి అడుగుపెడుతున్న జాన్వీ.. తన తల్లి శ్రీదేవిలాగే అందంతో ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని ఈ పాట చూస్తే తెలుస్తోంది. దేవర మూవీ నుంచి వచ్చిన ఈ సెకండ్ సింగిల్ ఇన్స్టాంట్ హిట్ గా నిలిచింది. ఈ పాట తెగ ట్రెండ్ అవుతోంది. తారక్, జాన్వీ కెమెస్ట్రీ చూసి ఒకప్పటి ఎన్టీఆర్, శ్రీదేవి జోడికి గుర్తుకు వస్తోందంటూ కొందరు కామెంట్ చేయడం విశేషం. ఈ దేవర పార్ట్ 1 మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.