మహేష్ బాబు ఇల్లు చూశారా.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

frame మహేష్ బాబు ఇల్లు చూశారా.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే.. ఒకవైపు అభిమానులను మెప్పిస్తూనే మరొకవైపు ఎంతోమందికి సహాయం చేస్తూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మహేష్ బాబు. ముఖ్యంగా మహేష్ బాబు కాకుండా తమ కుటుంబం కూడా ఎన్నో మంచి పనులను చేస్తూ ఉన్నది. అటు సినిమాల పరంగా ఇటు యాడ్స్ పరంగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్న మహేష్ బాబు స్వగ్రామ బుర్రపాలం తో పాటు తెలంగాణలో ఉండే సిద్దాపురం అనే గ్రామాలను కూడా దత్తకు తీసుకొని చాలా అభివృద్ధి చేస్తున్నారట.

పద్మాలయ స్టూడియోతో కూడా కొన్ని వందల కోట్ల రూపాయలను సంపాదించిన మహేష్ బాబు తన భార్య నమ్రతా కూడా ఎంతో ఖరీదైన ఆస్థిపాస్తులను కూడా సమకూరుస్తూ ఉన్నది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సుమారుగా 30 కోట్లకు విలువచేసే ఇంటిని నిర్మించారు మహేష్ బాబు. ముఖ్యంగా ఈ ఇంట్లో వుడెన్ ఫర్నిచర్, స్విమ్మింగ్ పూల్, డార్క్ వాల్స్ ఇతరత్రా వాటి గురించి ఎప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా మహేష్ కుటుంబం ఎన్నోసార్లు ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూనే ఉంటారు.

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమాని అనౌన్స్మెంట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పలు రకాల పనులు కూడా జరుగుతున్నాయి. సుమారుగా 1500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా గురించి వస్తున్న ఊహగానాలపైన నిర్మాత క్లారిటీ ఇస్తూనే ఉన్నారు.. నిన్నటి రోజున మహేష్ బాబు బర్తడే సందర్భంగా సినిమా నుంచి ఏదైనా అప్డేట్ ఉంటుందా అని అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూసిన వారికి నిరాశ మిగిలిపోయింది. మొదటిసారి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాలో నటిస్తున్నారు మహేష్ బాబు. ఈ చిత్రాన్ని 2028లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: