ఇండియాలో ఎంతో మంది బడా హీరోలు ఉన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే తమదైన నటనతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. అలాంటి వారిలో విశ్వనాయకుడు కమల్ హాసన్ ఒకరు. వైవిధ్యమైన నటనతో విభిన్నమైన సినిమాలు చేస్తోన్న ఆయన.. 'విక్రమ్'తో బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. ఈ ఊపులోనే మరిన్ని ప్రాజెక్టులను చేస్తున్నారు.ఇటీవల థియేటర్లలోకి వచ్చి మిశ్రమ స్పందనను రాబట్టుకున్న చిత్రం ‘భారతీయుడు 2’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ మూవీని పొన్నియన్ సెల్వన్ వంటి భారీ చిత్రం తర్వాత అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ రెడ్ జెయింట్ బ్యానర్‌తో కలిసి హై బడ్జెట్‌తో నిర్మించారు.జూలై 12వ తేదీన ఎంతో గ్రాండ్‌గా తీసుకు వచ్చారు. విడుదలకు ముందు చాలా ప్రచార కార్య్రమాలు నిర్వహించి హాడావుడి చేసినప్పటికీ సినిమాలోని అసలు లైన్‌ను ప్రమోట్ చేయకపోవడంతో ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.ఫలితంగా ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆశించిన రీతిలో దక్కలేదనే చెప్పాలి. ఇలా ఈ సినిమాకు కలెక్షన్లు చాలా తక్కువగానే వచ్చాయి. దీంతో కమల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా మిగిలింది.సక్సెస్‌ఫుల్ కాంబోలో రూపొందిన 'భారతీయుడు 2' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఫేమస్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సదరు సంస్థ నెల రోజుల తర్వాతనే స్ట్రీమింగ్ చేస్తుందని ప్రచారం జరిగింది. కోలీవుడ్‌లో పెట్టిన రూల్ వల్ల మరింత ఆలస్యం అవుతుందని అనుకున్నారు. కానీ, ఇది స్ట్రీమింగ్ డేట్ ప్రకటించింది. మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీతో రూపొందిన 'భారతీయుడు 2' సినిమాను ఆగస్టు 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే గత అర్ధరాత్రి నుంచి దీన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతేకాదు, ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తోంది. ఫలితంగా ఈ చిత్రం ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.ఇదిలా ఉండగా.. శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్‌లో రూపొందిన 'భారతీయుడు 2' సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్స్ మూవీస్ బ్యానర్లపై శుభకరణ్, ఉదయనిధి స్టాలిన్ నిర్మించారు. ఇందులో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్యలు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.