అల్లు అర్జున్ కారణంగా మెగా ఫ్యామిలీ - అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ పెరుగుతోంది. గతంలో చేసిన పొరపాట్లను మెగా ఫ్యామిలీ పెద్దగా పట్టించుకోకపోయినా.. ఇటీవల ఎన్నికల్లో బన్నీ.. జనసేనానికి కాకుండా వైసీపీకి ప్రచారం చేయడాన్ని మెగా కాంపౌండ్ సీరియస్‌గా తీసుకున్నట్లుగానే కనిపిస్తోంది. పవన్ ప్రమాణ స్వీకారం, చిరంజీవి ఇంట్లో సెలబ్రేషన్స్ ఇలా ఎక్కడా అల్లు ఫ్యామిలీ జాడ లేదు. ఇప్పటికే అల్లు అర్జున్‌పై నాగబాబు, సాయిథరమ్ తేజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చిరంజీవి రంగంలోకి దిగి పరిస్ధితిని అదుపు చేసినట్లుగా ఫిలింనగర్ టాక్. అల్లు అర్జున్‌పై ఎప్పుడూ పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన దాఖలాలు లేవు. అలాంటిది ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఎక్కడో తేడా కొడుతున్నాయి. డిప్యూటీ సీఎం, ఏపీ అటవీ శాఖ మంత్రి హోదాలో కర్ణాటక పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశారు. ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని.. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు.ఈ సందర్భంగా బెంగళూరులో డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ..ప్రస్తుతం వస్తున్న సినిమాలు ఇలా ఉన్నాయంటూ ఓ కామెంట్ చేశారు. "ఒకప్పుడు అడవుల్ని రక్షించే పాత్రల్లో హీరోలు నటించేవారు.. ఇప్పుడు అడవుల్ని నరికేసి, స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్లలో నటిస్తున్నారు" అంటూ పవన్ కామెంట్ చేశారు.
ఈ ఒక్క మాటతో అల్లు Vs మెగా వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఇక బన్నీ ఊరుకున్నా తాము సహించలేమంటూ అల్లు ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మీ వల్ల ఏం కాదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మెగా ఫ్యాన్స్ కూడా సవాళ్లు విసురుతున్నారు.అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అల్లు అర్జున్ గురించి చేసినవేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన పుష్పలో హీరో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తాడు. పవన్ కామెంట్స్‌పై అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అందరు హీరోలను ఉద్దేశించే డిప్యూటీ సీఎం జనరల్‌గా చెప్పారని మెగా ఫ్యాన్స్ కవర్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎటు తిరుగుతుందో చూడాలి.దీంతో పవన్ వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప 2 ఈ ఏడాది డిసెంబర్ 6న విడుదలకు రెడీ అవుతోంది. దీంతో పవన్ వ్యాఖ్యలు ఖచ్చితంగా పుష్ప 2 పై ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ పై కోపంగా ఉన్న పవన్ ఫ్యాన్స్ తాజా వ్యాఖ్యలతో మరింత రెచ్చిపోయే అవకాశం లేకపోలేదంటున్నారు.