టెక్నిక్ తో వందల కోట్లు గణిస్తున్న కల్కి !

Seetha Sailaja
‘బాహుబలి 2’ తరువాత రియల్ బ్లాక్ బష్టర్ హిట్ ప్రభాస్ కు ‘కల్కి 2898’ అందించింది. 1000 కోట్ల మార్క్ ను దాటిపోయి 1200 కోట్ల మార్క్ వైపు పరుగులు తీస్తున్న ‘కల్కి 2898’ సూపర్ సక్సస్ వెనుక ఒక మాష్టర్ ప్లాన్ ఉంది. ‘కల్కి’ మూవీ విడుదలైన రెండు వారాల వరకు పెంచిన టిక్కెట్ల రేట్లతో ఆసినిమాను ప్రదర్శించారు. ఆ రెండు వారాల తరువాత టిక్కెట్ రేట్లు సాధారణ స్థాయికి రావడంతో అప్పటివరకు ఆసినిమాను చూడని వారంతా చూడటంతో కలక్షన్స్ నిలబడ్డాయి.

ఆపై ఈసినిమాకు పోటీగా విడుదలైన ‘భారతీయుడు 2’ భయంకరైన ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సినిమాలు చూడాలి అని ఆరాట పడే వారికి ‘కల్కి’ మరొక ఆప్ క్షన్ లేకుండా పోయింది. దీనికితోడు ‘కల్కి’ తరువాత గత కొన్ని వారాలుగా విడుదల అయిన చిన్న సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అవ్వడం కూడ ‘కల్కి’ కలక్షన్స్ కు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు ఈసినిమా కలక్షన్స్ ను మరొక మాష్టర్ ప్లాన్ నిలపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ‘కల్కి’ టిక్కెట్ల రేట్లను మరింత తగ్గించడంతో ఈమూవీని ఇప్పటివరకు చూడనివారంతా ఇప్పుడు ఈసినిమాను చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు గడిచిన సోమ వారం బుక్ మై షో యాప్ లో ఈమూవీ టిక్కెట్స్ 10 వేలకు పైగా అమ్మకం జరిగాయని వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. 40 రోజులు దాటినప్పటికీ ఈసినిమాకు ఈ స్థాయిలో కలక్షన్స్ రావడం చాలమందిని ఆశ్చర్య పరుస్తోంది.  


ఇది ఇలా ఉంటే దర్శకుడు నాగ్ అశ్విన్ ఆలోచనలు ‘కల్కి 2’ స్క్రిప్ట్ వైపు వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీ రెండవ భాగంలో ‘మహాభారతం’ లోని చాల కొత్త పాత్రలు కనిపిస్తాయని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్న పరిస్థితులలో మరో సంవత్సరం వరకు ‘కల్కి 2’ సెట్స్ పైకి వచ్చే ఆస్కారం లేదు అని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: