డబుల్ ఇస్మార్ట్ ఆయన హ్యాండ్ ఇస్తున్నాడా..?
డబుల్ ఇస్మార్ట్ హీరో రామ్, డైరెక్టర్ పూరీ ఇద్దరు ప్రమోషన్స్ కు సై అంటున్నా సరే విలన్ సంజయ్ దత్ మాత్రం నో అంటున్నాడట. బాలీవుడ్ లో దాదాపు కెరీర్ ముగిసింది అనుకున్న సజయ్ దత్ కి సౌత్ నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయి. కె.జి.ఎఫ్ 2 తో అతని క్రేజ్ డబుల్ అయ్యింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో వస్తున్నాడు. రామ్ డబుల్ ఇస్మార్ట్ లో సంజయ్ విలనిజం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని టాక్.
ఐతే సినిమాలో నటించడానికి కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారు కానీ ప్రమోషన్స్ కి మాత్రం అసలు అటెండ్ అవ్వరు. కావాలని చేస్తారో లేక రావడం ఇష్టం లేక తప్పించుకుంటారో కానీ సంజయ్ దత్ కూడా డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్ కోసం నో అంటున్నాడట. ఒకప్పటి స్టార్ కదా అని సంజయ్ ని సినిమాలో పెట్టుకుని ఆయన చేత భారీ ప్రమోషన్స్ చేసి సినిమాపై బజ్ పెంచుకుందామంటే ప్రమోషన్స్ కు రాకుండా డబుల్ ఇస్మార్ట్ యూనిట్ కి షాక్ ఇస్తున్నాడు సంజయ్ దత్. అందుకే సినిమా ప్రమోషన్స్ అన్నీ కూడా ముంబైలోనే జరుగుతున్నాయని తెలుస్తుంది. తెలుగులో డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది.