పుష్ప మూవీపై పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్?

frame పుష్ప మూవీపై పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్?

Purushottham Vinay

సినిమాల్లో పాత్రలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకప్పుడు హీరోలంతా కూడా అడవులను కాపాడే పాత్రలని చేస్తుంటే ఈ రోజుల్లో మాత్రం యువ హీరోలంతా కూడా మాఫియా, స్మగ్లింగ్ పాత్రలు ఎక్కువగా చేస్తున్నారన్నారు. ప్రస్తుతం పరిస్థితి కూడా చాలా మారింది. ఇప్పుడు హీరోలు అడవిని నాశనం చేసే స్మగ్లర్లుగా నటిస్తున్నారు అని పవన్ కళ్యాణ్ అన్నారు . రాజ్‌కుమార్‌ గందధ గుడి సినిమా అంటే నాకు ఇష్టమని అన్నారు. అడవిని రక్షించడమే గందధ గుడి సినిమా కాన్సెప్ట్ అని అది నాకు బాగా నచ్చిందని అన్నారు.అయితే అడవిని రక్షించడం ఫారెస్ట్ అధికారుల విధి అంటూ ఆయన ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. అయితే పవన్ కల్యాణ్ కామెంట్స్ పై నెట్టింట చాలా జోరుగా చర్చ మొదలైంది. అల్లు అర్జున్ పుష్ప సినిమాను ఉద్దేశించే పవన్‌ ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.ఈ మేరకు బెంగళూర్ పర్యటనకు వెళ్లిన డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అవ్వడం జరిగింది. 


ఇక ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై ఆయన చర్చించడం జరిగింది. ఇందులో కర్ణాటక బయో ఎనర్జీ డెవలప్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ కూడా పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సీక్వెల్ అయిన పుష్ప 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంది. పైగా అల్లు అర్జున్ ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ కంటే తన భార్య ఫ్రెండ్ వైసీపీ నేతకే ఎక్కువ సపోర్ట్ ఇవ్వడం వల్ల అల్లు అర్జున్ పై మెగా ఫ్యామిలీలో నెగటివ్ ఫీలింగ్ అనేది ఏర్పడింది. అలాగే మెగా ఫ్యామిలీ లో కూడా అల్లు అర్జున్ పట్ల విభేదాలు వచ్చాయి. దాంతో పవన్ కళ్యాణ్ కావాలనే అల్లు అర్జున్ పై ఇలా కామెంట్స్ చేసారంటూ వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: