టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విశ్వక్సేన్. ప్రస్తుతం స్టార్ హీరోలకు ఏమాత్రం తీసుకుపోకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తన పదమూడవ సినిమా అనౌన్స్మెంట్ వచ్చి 24 గంటలు కాకముందే మరో కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు ఈ యంగ్ హీరో. యంగ్ హీరో విశ్వక్ సేన్ తదుపరి మెకానిక్ రాకీ చిత్రంలో కనిపించనున్నాడు. అక్టోబర్ 31 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విశ్వక్ సేన్ కొత్త చిత్రానికి
సంబంధించిన ప్రకటన వెలువడింది. విశ్వక్ సేన్ ను దర్శకుడు కేవీ డైరెక్ట్ చేయనున్నారు. VS14 అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. మేకర్స్ ఈ వివరాలను పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నటీనటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. యూనిక్ స్టోరీ లైన్ తో హిలేరియస్ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కించనున్నట్టు మేకర్స్
తెలియజేశారు. మరోవైపు విశ్వక్ సేన్ హీరోగా రవితేజ ముళ్లపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న 'మెకానిక్ రాకీ' సినిమా నుంచి 'గుల్లేడు గుల్లేడు' అనే ఫోక్ సాంగ్‌ను బుధవారం విడుదల చేశారు. జేక్స్ బెజోయ్ కంపోజ్ చేసిన ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని అందించారు. యశ్ మాస్టర్ కొరియోగ్రఫీలో విశ్వక్, మీనాక్షి చౌదరి జంట ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మొత్తానికి సినిమాల విషయంలో జోరు పెంచాడు విశ్వక్సేన్. ఇక ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విశ్వక్ ఇప్పుడు చేస్తున్న సినిమాలతో ఎటువంటి హిట్ అందుకుంటాడో చూడాల్సిందే..!!