ఒకే వేదికపై ఇద్దరు పాన్ ఇండియా స్టార్ హీరోలు.. ఫ్యాన్స్ కు పండగే..?

frame ఒకే వేదికపై ఇద్దరు పాన్ ఇండియా స్టార్ హీరోలు.. ఫ్యాన్స్ కు పండగే..?

murali krishna
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది స్టార్ హీరోలు తమ బంధువులను సైతం సినీ రంగంలోకి పరిచయం చేశారు. అలా ఇప్పటికే ఎంతో మంది కుర్రాళ్లు మూవీ జర్నీని మొదలు పెట్టేశారు. అలా పరిచయం అయిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ఒకడు.జూనియర్ ఎన్టీఆర్ బావమరిది ‘నార్నే నితిన్’ మ్యాడ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నితిన్  ‘ఆయ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.క్రేజీ కాన్సెప్టుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఆయ్' మూవీని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయబోతున్నారు.ఇదిలా ఉండగా.. పూర్తి స్థాయి ఫన్ స్టోరీతో రూపొందుతోన్న ‘ఆయ్’ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది నిర్మిస్తున్నారు. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తుంది. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. రామ్ మిరియాల ‘ఆయ్’ కు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఇప్పటికే పలు ఈవెంట్లను కూడా నిర్వహించారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా ఈ సినిమా హడావిడే కనిపిస్తోన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'ఆయ్' మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ఇప్పటికే ముమ్మరం చేసేసింది. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

దీన్ని మరో రెండు మూడు రోజుల్లో జరిపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు తాజాగా న్యూస్ వైరల్ అవుతోంది.ఆయ్’.. అంజిబాబు దర్శకత్వంలో గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు నిర్మించిన చిత్రం. ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్ లాంటి బడా సినిమాల మధ్యలో రిలీజ్ అవుతోంది. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. దాంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను గట్టిగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున ఏర్పాటు చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ భావిస్తోంది. ఇక ఈ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లను ముఖ్య అతిథులుగా తీసుకురావాలని ప్లాన్ వేస్తున్నారట. ఈ స్టార్ హీరోలను తమ ఈవెంట్ కు తీసుకురావడం ద్వారా పబ్లిసిటీ పీక్స్ చేరుకుంటుందన్నది మేకర్స్ భావన. అయితే వారు రావడానికే ఛాన్స్ లు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే? ఆయ్ సినిమా హీరో నార్నే నితిన్ తారక్ కు బావమరిది. మరోవైపు గీతా ఆర్ట్స్ బ్యానర్ కావడంతో అల్లు అర్జున్ కూడా రావడానికి సిద్ధంగానే ఉంటారు. దాంతో వీరిద్దరిని ఒకే వేదికపై చూడాలన్న అభిమానుల కోరిక నెరవేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక వీరిద్దరు ఒకే స్టేజ్ పై కనిపిస్తే.. ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి. ఈ క్షణం కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: