మెగా ఫ్యాన్స్ టార్చర్ తట్టుకోలేక ఆ పని చేసిన కీర్తీ సురేష్?

frame మెగా ఫ్యాన్స్ టార్చర్ తట్టుకోలేక ఆ పని చేసిన కీర్తీ సురేష్?

Purushottham Vinay

స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ కేవలం తెలుగు చిత్రాల్లో మాత్రమే కాకుండా మలయాళం, తెలుగు తమిళ మూవీల్లో కూడా నటించి ప్రేక్షకుల నుంచి మెప్పు పొందుతుంది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన టాలెంట్ చూపించడానికి రెడి అవుతుంది. ఈ బ్యూటీ ఫస్ట్ నుంచి కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలక్ట్ చేసుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకుంది.సీనియర్ టాప్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి,  సూపర్ స్టార్ రజనీకాంత్‌కు చెల్లెలిగా ఎమోషనల్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల హార్ట్‌ ని కూడా మెల్ట్ చేసింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోల సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది.కీర్తి సురేష్ ప్రస్తుతం 'ఉప్పు కప్పురంగు' అనే టైటిల్‌లో తెరకెక్కుతోన్న మూవీలో నటిస్తోంది. ఇంకా అలాగే 'రఘుతాత' అనే మూవీల కూడా కీర్తీ సురేష్ నటిస్తోంది. 


రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది. ఆగస్ట్ 15 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యే ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కీర్తీ సురేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా కీర్తి సురేష్ మెగా ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్‌కు కూడా గురవుతుంది. అయితే ఈ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి కంటే తలపతి విజయ్ చాలా బాగా డాన్స్ చేస్తారని ఆమె చెప్పింది. ఇక కీర్తి సమాధానానికి నెట్టింట మెగా ఫ్యాన్స్ కోపంతో రగిలిపోతూ చాలా దారుణంగా ఊగిపోతున్నారు. ఆమెని చాలా భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరోనే తక్కువ చేసి మాట్లాడుతావా? ఇది మెగాస్టార్ ను దారుణంగా అవమానించినట్లేనంటూ ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తిట్లు తిడుతూ ఆమెను చాలా దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో కీర్తీ సురేష్ మెగా ఫ్యాన్స్ తిట్లు తట్టుకోలేక తన కామెంట్స్ సెక్షన్ ని టర్న్ ఆఫ్ చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: