బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. దానికి ప్రధాన కారణం రీసెంట్ గా తన బర్త్డే వేడుకల్లో లండన్ బిజినెస్ మ్యాన్ కబీర్ బహియా తో ఆమె క్లోజ్ గా ఉన్న ఫోటోలు, పార్టీలు చేసుకున్న ఫోటోలు మీడియా లో సెంటరాఫ్ అట్రాక్షన్ అయ్యాయి. దాంతో ఒక్క సారిగా మీడియా లో హైలైట్ అయిపోయింది కృతి సనన్. అప్పటి వరకు కృతి సనన్ సినీ లైఫ్ గురించి మాట్లాడుకున్న వాళ్ళందరూ ప్రస్తుతం ఆమె పర్సనల్ లైఫ్ గురించి గుస గుసలు పెట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఈ హీరోయిన్ కబీర్ బహియా తో రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుంది అని ఒక సంచలన పోస్టు వైరల్ అవుతుంది.
మరి ఇంతకీ ఆ పోస్ట్ పెట్టింది ఎవరు.. ఇది నిజమేనా అనేది ఇప్పుడు చూద్దాం. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ లపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ రాక్షసానందం పొందుతున్న వారు ఎవరు అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఉమైర్ సందు మాత్రమే. బాలీవుడ్ క్రిటిక్ గా అని పేరు చెప్పుకుంటూ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఉమైర్ సందు తాజాగా కృతి సనన్ ని టార్గెట్ చేశారు.
ఆయన తన సోషల్ మీడియా ఖాతా లో కృతి సనన్ గ్రీస్ దేశం లో తన ప్రియుడు కబీర్ బహియా తో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది అంటూ ఒక వివాదాస్పద పోస్ట్ పెట్టారు. దీంతో ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజెన్స్ నీకు ఎన్ని సార్లు చెప్పినా బుద్ధి రాదా? ఇక నీ బుద్ధి మారదా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి ఉమైర్ సందు పెట్టిన పోస్ట్ పై కృతి సనన్ ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో..