ఒక్క ప్రాజెక్టుకే అన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న సమంత.. రికార్డు బద్దలు!!
అది ఏంటంటే ఈ ముద్దుగుమ్మ సింగిల్ ప్రాజెక్టుకు రూ.10 కోట్లు తీసుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ వెబ్‌సిరీస్ 'సిటాడెల్-హనీ బన్నీ'లో నటించేందుకు ఆమె రూ.10 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. సమంత తప్ప ఇప్పటివరకు ఎవరూ కూడా ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందుకోలేదని చెప్పుకోవచ్చు. ఈ కాలంలో మీడియం రేంజ్ హీరోలు కూడా అంత అమౌంట్ తీసుకునే లెవల్ కి వెళ్ళలేదు కానీ సమంత హీరోలకు దీటుగా అంత మొత్తంలో డబ్బులు సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
సమంత "ది ఫ్యామిలీ మ్యాన్" సీజన్ 2 లో విలన్ పాత్ర చేసి చాలా పేరు తెచ్చుకుంది. ఈ సిరీస్‌లో ఆమె నటన చూసి ప్రేక్షకులు చాలా ఆశ్చర్యపోయారు. అప్పుడు నుంచి ఆమెకు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. దీని తర్వాతనే ఆమెకు "సిటాడెల్" అనే వెబ్ సిరీస్ కోసం 10 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఈ సిరీస్ టీజర్ చూసిన ప్రేక్షకులు ఆమె అందం, యాక్షన్ సీన్స్ చూసి ముగ్ధులయ్యారు.
సమంత తన కెరీర్ మొదట్లోనే చాలా పేరు సంపాదించుకుంది. "సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు", "రంగస్థలం" లాంటి సినిమాల తర్వాత ఆమె రెమ్యునరేషన్ చాలా పెరిగింది. ఇప్పుడు ఆమె OTT ఇండస్ట్రీలో అత్యధికంగా సంపాదించే నటి. నవంబర్ 7న "సిటాడెల్" రిలీజ్ కాబోతుంది. ఆమె కెరీర్‌లో ఇది మరో మైలురాయి అని అభిమానులు భావిస్తున్నారు.