ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమాలు గా విడుదలైన చాలా చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అంతేకాకుండా మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చిన సినిమాలు సైతం భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక అందులో ప్రేమలు సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యి తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో హీరోయిన్గా నటించిన మమత బైజు గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇందులో తన నటనతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ చిన్నది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ముద్దుగుమ్మ కనబడుతోంది. అంతలా తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ బ్యూటీ. తాజాగా ఈ బ్యూటీకి ఓ క్రేజీ ఆఫర్ అందుకుందని తెలుస్తోంది. దళపతి విజయ్ తదుపరి చిత్రంలో మలయాళ నటి మమితా బైజు కూడా నటిస్తుందని వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి 'దళపతి 69' అనే టైటిల్ను తాత్కాలికంగా ఖరారు చేశారు. ఈ సినిమా లో మమిత కూడా ఓ పాత్రలో నటిస్తుందని తమిళ మీడియా వినిపిస్తున్నాయి. 'ప్రేమలు' తర్వాత మమిత క్రేజ్ మరింత పెరిగింది. అయితే దళపతి
విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ కావడానికి సిద్ధమవుతున్నారు. సొంత పార్టీని కూడా ప్రకటించారు. ప్రస్తుతం 'గోట్' అనే చిత్రంలో నటిస్తున్నాడు, ఆ తర్వాత తన కెరీర్లో చివరి సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా లో మమిత కూడా కనిపించనుందని సమాచారం. 'దళపతి 69' చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఈ సినిమ లో మమిత ప్రధాన పాత్రలో నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమా లో దళపతి విజయ్ సోదరిగా మామిత నటిస్తుందని తెలుస్తోంది. ఇది విని ఆమె అభిమానులు థ్రిల్ అవుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. 'ప్రేమలు' తర్వాత మమిత క్రేజ్ మరింత పెరిగింది. ..!!