దేవర సెకండ్ సింగిల్ పై దారుణమైన ట్రోలింగ్.. కారణం అదేనా..!?

frame దేవర సెకండ్ సింగిల్ పై దారుణమైన ట్రోలింగ్.. కారణం అదేనా..!?

Anilkumar
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ‘దేవ‌ర’ సెకండ్ సింగిల్ సాంగ్ ఎట్ట‌కేల‌కు రిలీజ్ అయ్యింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్, అందాల భామ జాన్వీ క‌పూర్ లు ఈ సాంగ్ తో పూర్తిగా రొమాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్లారు. ‘ఫియ‌ర్ సాంగ్’ అంటూ వ‌చ్చిన ఫ‌స్ట్ సాంగ్ ‘దేవ‌ర‌’లోని విధ్వంసాన్ని చూపెట్టేలా ఉండ‌గా.. ‘చుట్ట‌మ‌ల్లె’ అంటూ వ‌చ్చిన ఈ పాట రొమాన్స్ ను ప‌రిచ‌యం చేసింది.ఇక ఈ పాట‌కు లిరిసిస్ట్ రామ‌జోగ‌య్య శాస్త్రి చ‌క్క‌టి లిరిక్స్ అందించ‌గా.. అనిరుధ్ ర‌విచంద‌ర్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు.

 సింగ‌ర్ శిల్పా రావు ఈ పాట‌ను అద్బుతంగా ఆల‌పించారు. ఇక ఈ పాట ఇన్స్టంట్ చార్ట్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌గా, ఈ సాంగ్ రికార్డుల‌ను తిర‌గ‌రాయ‌డం ఖాయ‌మ‌ని మ్యూజిక్ ల‌వ‌ర్స్ అంటున్నారు. జాన్వీ అందాలు అభిమానుల‌కు అదిరిపోయే ట్రీట్ అని చెప్పాలి. అయితే ఒక వర్గం దీనిని కాపీ క్యాట్ సాంగ్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలెట్టారు. అనిరుద్ కూడా వేరొక సాంగ్ ట్యూన్స్ లేపేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. దేవర పాటకి సంబందించిన ఒరిజినల్ ట్యూన్ శ్రీలంకకి చెందిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ నుంచి

 కాపీ చేశారని ట్రోల్ చేస్తున్నారు. 'మనికే మగే హీతే' అనే ఆ పాటను దేవర పాటకు జత చేసి అచ్చం ఒకే తరహాలో రెండు పాటల ట్యూన్స్ లిరిక్ స్టైల్ ఉన్నాయని అంటున్నారు. అయితే సాంగ్ ఎలా ఉన్న మెలోడియస్ గా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యిందని ఎన్టీఆర్ అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. ఈ ట్రోలింగ్ అనేది ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ రెగ్యులర్ గా ఫేస్ చేసేదే. ప్రతి హీరోకి అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కి యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఉంటారు. వీరు పనిగట్టుకొని కేవలం సినిమా ఇమేజ్ ని దెబ్బతీయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తారనే మాట సోషల్ మీడియాలో మరో వర్గం కౌంటర్ ఇస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: