టాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యంత క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీలోని నటనకు గాను అల్లు అర్జున్ కి ఏకంగా నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇకపోతే అల్లు అర్జున్ కెరీర్ లో ఒక డ్రీమ్ రోల్ ఉందట. ఆ రోల్ చేయాలి అని ఆయన చాలా రోజులుగా అనుకుంటున్నాడట.
అసలు ఆ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా ..? అల్లు అర్జున్ కు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాలని ఉందట. అల్లు అర్జున్ కొన్ని సంవత్సరాల క్రితం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన రేసు గుర్రం సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ క్లైమాక్స్ లో అల్లు అర్జున్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. కాకపోతే అల్లు అర్జున్ కు ఫుల్ లెన్త్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాలని ఉందట. అలాంటి పాత్ర కోసం ఆయన ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఫుల్ లెన్త్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించకపోవడంతో అలా ఆయన నటిస్తే ఆ సినిమా ఈజీగా అదిరిపోయే రేంజ్ విజయం అందుకుంటుంది అని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు.