ఇండస్ట్రీ ఎవడబ్బ సొత్తు కాదు.. నాగబాబు షాకింగ్ వ్యాఖ్యలు వైరల్..!!

frame ఇండస్ట్రీ ఎవడబ్బ సొత్తు కాదు.. నాగబాబు షాకింగ్ వ్యాఖ్యలు వైరల్..!!

murali krishna
మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగా ఫ్యామిలీపై పడి ఏడ్చేవాళ్లకి ఆయన స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా షాకింగ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.నాగబాబు ఏం మాట్లాడినా ఓపెన్‌గా మాట్లాడతాడు. ఓపెన్‌గా విమర్శిస్తాడు. తిట్టాల్సి వస్తే నిర్మొహమాటంగా చెబుతాడు. తాజాగా ఆయన కామెంట్స్ ఆసక్తికరంగా మారింది. కూతురు నిహారిక నిర్మాతగా నిర్మించిన తొలి సినిమా కమిటీ కుర్రోళ్లు చిత్రం ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సోమవారం సాయంత్రం నిర్వహించారు. వరుణ్‌ తేజ్‌, సాయితేజ్‌, అడవిశేష్‌ లతోపాటు గెస్ట్ గా వచ్చిన నాగబాబు మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో చాలా మంది కొత్త కుర్రాళ్లు నటించిన నేపథ్యంలో వాళ్లని ఉద్దేశిస్తూ మాట్లాడాడు నాగబాబు. చాలా టాలెంట్‌ యాక్టర్స్ ఉన్నారని, బాగా చేశారని తెలిపారు.అదే సమయంలో సినిమా ఇండస్ట్రీ ఎవరి అబ్బ సొత్తు కాదని, కొందరు మాట్లాడితే మెగా ఫ్యామిలీ అంటూ మాపై ఏడుస్తుంటారు. మెగా ఫ్యామిలీ తప్ప మరెవ్వరూ ఉండరు, అలానే మరికొంత మంది ఫ్యామిలీస్‌ మీద పనికిమాలిని మాటలు మాట్లాడే ఎదవలను చాలా మందిని చూశాం. మాకు అలాంటి ఫీలింగ్‌ లేదు. సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు. మా నాన్న సామ్రాజ్యం కాదు, మా తాత సామ్రాజ్యం కాదు. అక్కినేని ఫ్యామిలీ, నందమూరిఫ్యామిలీ సామ్రాజ్యం కాదు, ఇది అందరిది. అడవి శేషు లాంటి ఎంతో మంది నటులు సినిమాలకు సంబంధం లేకుండా వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్ల టాలెంట్‌తోనే పైకి వచ్చారు.ఇప్పుడు కమిటీ కుర్రోళ్లు సినిమాలోని పిల్లలో భవిష్యత్‌లో ఎవరు ఏమవుతారో తెలియదు. ఏరేంజ్‌కి వెళ్తారో ఎవరూ ఊహించలేరు. ఈ రోజు సినిమాలే కాదు, ఓటీటీలు కూడా ఉన్నాయి, ఏదో రూపంలో టాలెంట్‌ని చూపించుకునే అవకాశం ఉంది. కమర్షియల్‌సినిమాలు కాకుండా, పాటలు, ఫైట్లు అని కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని తెలిపారు నాగబాబు. ఈ విషయంలో శేష్‌నచ్చుతాడు, వరుణ్‌ బాబు నచ్చుతాడు. ఇప్పుడు తేజ్‌ నచ్చుతున్నాడు అన్నాడు నాగబాబు.

ఇండస్ట్రీ ఎవరి సొంతం కాదని, ఎవరైనా రావచ్చు, టాలెంట్‌ నిరూపించుకోవచ్చు, గొప్పగా ఎదగొచ్చు అని చెప్పాడు. అమ్మాయిలు కూడా ఎదిగే అవకాశం ఉంది. సినిమా మేల్‌ డామినేషనే కాదు, ఆడవాళ్లు కూడా రావాలి. వాళ్లు కూడా గొప్పగా ఎదగాలి. హీరోయిన్‌గానే కాదు, టెక్నీషియన్లుగానూ ఎదగాల్సిన అవసరం ఉంది. ఆ వైపు చాలా లోటు గ్యాప్‌ ఉంది. ఆ వైపు కూడా దృష్టి పెట్టాలి. ఎవరైనా మిమ్మల్ని అడ్డుకుంటే ఆగకుండా మీరేంటో చూపించండి, అన్నింటిని దాటుకుని రండి. ఎవరికీ భయపడకండి. తెలంగాణలోనూ, ఆంధ్రాలోనూ ఆడపిల్లలకు అద్భుతమైన సేఫ్టీ ఉందని, ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే, ఏదైనా చేస్తే మడత పెట్టి లోపల పెడతాం అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు నాగబాబు. వాళ్ల తాట తీస్తాం.ఆ విషయంలో టెన్షన్‌ లేదు అని చెప్పాడు.ఇక నిహారిక నిర్మించిన ఈ చిత్రానికి యాదు వంశీ దర్శకత్వం వహించారు. 11 మంది కుర్రాళ్లు హీరోగా పరిచయం అవుతున్నారు. ఐదుగురు అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. అనుదీప్‌ దేవ్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కాబోతుంది. సినిమా గురించి నాగబాబు చెబుతూ, ఈ సినిమా చూశాక ఆడియెన్స్ ఓ ప్రముఖ నాయకుడు గుర్తొస్తాడని హింట్‌ ఇవ్వడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: