భారతీయుడుకు సీక్వెల్‌గా... శంకర్ డైరెక్షన్లో ఉలగనాయకన్ హీరోగా తెరకెక్కిన సినిమా భారతీయుడు2. ఎన్నో అంచనాల మధ్య జూలై 12న తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదలైన ఈ సినిమా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు.. నిడివి ఎక్కువగా ఉందని.. శంకర్ మార్క్ మిస్సైందంటూ విమర్శలు వచ్చేలా చేసుకుంది. దాంతో పాటే కలెక్షన్స్‌లో కూడా బాక్సాఫీస్ దగ్గర వెనకపడింది.దీంతో ఈసినిమా అనుకున్నదాని కంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం భారతీయుడు2 ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులనునెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.ఇక రీసెంట్ గానే ఓటిటి రిలీజ్ పై కూడా పలు వార్తలు వైరల్ గా మారగా వీటిలో ఈ ఆగస్టు 9 నుంచే ఈ చిత్రం ఓటిటిలో వచ్చేస్తుంది అని బజ్ వచ్చింది.మరి ఇపుడు ఈ బజ్ నిజం అయ్యిందని చెప్పాలి. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ అప్డేట్ ఇస్తూ ఈ ఆగస్టు 9నే అందుబాటులోకి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. సో ఈ చిత్రం నెల లోపే వచ్చేస్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో సిద్ధార్థ్ మరో ముఖ్య పాత్రలో నటించగా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్ తదితరులు నటించారు. అలాగే అనిరుద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.గత నెల 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఇండియన్-2 బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. దాదాపు రూ.250 కోట్ల థియేట్రికల్ టార్గెట్ తో వచ్చిన ఈ చిత్రం కనీసం 150 కోట్ల రూపాయలు కూడా రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ. 120 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ నిర్మాతలకు సదురు ఓటీటీ సంస్థలకు తకరారు నడిచింది. తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం నెట్ ఫ్లిక్స్, లైకా మధ్య భారతీయుడు -2 వివాదం ముగిసిందని సమాచారం. ఇక మరోవైపు ఇండియన్ -2 థియేట్రికల్ రన్ కూడా దాదాపు ముగిసినట్టే. దీంతో భారీ రేట్ కు డిజిటల్ రైట్స్ కొనుగోలు చేయడం,థియేటర్లలో భారీ ఫ్లాప్ గా నిలవడంతో డిజిటల్ ప్రీమియర్ గా ఇండియన్ -2 ను ఒప్పందం కంటే ముందుగా ఆగస్టు 9న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సదరు సంస్థ.