కల్కి 2898 ఏడి.. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలకి మించి హిట్ అయింది.. చాలామందికి తెలుగు ఇండస్ట్రీ అంటే చిన్నచూపు ఉండేది.కానీ ఈ మధ్యకాలంలో ఉన్న ఎంతో మంది దర్శకులు తెలుగువారి సత్తా ఏంటో నిరూపిస్తున్నారు. అలా 600 కోట్ల బడ్జెట్ పెడితే 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సంపాదించి బ్లాక్ బస్టర్ హిట్ అయింది కల్కి 2898 AD.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్,ప్రభాస్ ప్రధాన పాత్రల్లో విలన్ గా కమల్ హాసన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.కల్కి మూవీ విడుదలై నెల రోజులు దాటినా కూడా ఇంకా థియేటర్లలో కల్కి మానియా పోవడం లేదు. అయితే అలాంటి ఈ సినిమాలో సుప్రీమ్ యాస్కిన్ అనే విలన్ పాత్రలో కేవలం కొద్ది నిమిషాలే కనిపించిన కమల్ హాసన్ 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమాలో సుప్రీమ్ యాస్కిన్ పాత్రని నాగ్ అశ్విన్ చాలా వెరైటీగా తీర్చిదిద్దారు. అంతేకాదు ఆ పాత్రను చిన్నపిల్లలు చూస్తే కాస్త జంకుతారు. అయితే అలాంటి ఈ పాత్రని ఓ హీరో మిస్ చేసుకున్నారట. మరి ఇంతకీ సుప్రీమ్ యాస్కిన్ వంటి అద్భుతమైన పాత్రను మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరు.. ఎందుకు మిస్ చేసుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.. కల్కి మూవీలో హీరో కమల్ హాసన్ విలన్ గా నటించారు.అయితే ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు కూడా విలన్ పాత్రల్లో నటిస్తున్నారు.అలా కమల్ హాసన్ కూడా ఆ బాటలో నడిచి సక్సెస్ అయ్యారు. అయితే కమల్ హాసన్ సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో నటించడానికి ముందుగా నో చెప్పారట.
ఎందుకంటే ఆయన వేరే సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల డేట్స్ అడ్జస్ట్ కావు, లేట్ అవుతుంది అని చెప్పారట. దాంతో ఈ అవకాశం మలయాళ హీరో మోహన్ లాల్ కి ఇద్దాం అనుకున్నారట చిత్ర యూనిట్. ఆ తర్వాత మోహన్ లాల్ దగ్గరికి వెళ్లి ఆయనకి ఈ పాత్ర గురించి చెబుదామనుకున్న సమయంలోనే కమల్ హాసన్ నుండి ఫోన్ వచ్చి నేను ఈ సినిమాలో చేస్తాను అని చెప్పారట. అలా చివరికి ఈ పాత్రలో కమల్ హాసన్ నటించారు.ఒకవేళ కమల్ కాస్త లేట్ చేస్తే మాత్రం కచ్చితంగా ఆ పాత్ర మోహన్ లాల్ కి ఇచ్చేవారట దర్శకుడు నాగ్ అశ్విన్.కానీ ఈ పాత్ర చేసే అవకాశం తృటిలో మిస్ చేసుకున్నారు మోహన్ లాల్ అంటున్నారు ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు