వయనాడ్ బాధితులకు విరాళం అందించిన చిరు, రామ్ చరణ్.. ఎంతంటే..

frame వయనాడ్ బాధితులకు విరాళం అందించిన చిరు, రామ్ చరణ్.. ఎంతంటే..

lakhmi saranya
కేరళలో వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరుగుపడిన ఘటన దేశాన్ని విషాదంలోకి నెట్టేసింది . ఈ ఘటనలో ఏకంగా 358 మంది ప్రాణాలు కోల్పోగా .. ఏకంగా 518 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి . అయితే ఇంకా మరికొద్ది మంది తప్పు పోయిన వారి ఆచూకీ దొరకలేదు . ఇందులో నష్టపోయిన బాధిత కుటుంబాలకు చాలామంది కోలీవుడ్ స్టార్ హీరోలు అండ్ హీరోయిన్లు తమ వంతు సహాయం చేస్తున్నారు . ఇక ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి అల్లు అర్జున్ సైతం 25 లక్షలు అందించారు . దీంతో బని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు .

ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి అండ్ రామ్ చరణ్ కూడా ఇందుకు ముందుకొచ్చారు . వీరిద్దరూ కలిసి బాధితులకు కోటి విరాళం అందించారు . ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు . అంతేకాకుండా ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు . " గత కొన్ని రోజులుగా ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం , వందలాది విలువైన ప్రాణాలు కోల్పోయేందుకు తీవ్ర మనో వేదానికి గురయ్యా . వయనాడ్ దుర్ఘటన బాధితులకు నా హృదయం వెలు విరుస్తుంది .

కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు చరణ్ అండ్ నేను కలిసి ఒక కోటి విరాళంగా అందజేస్తున్నాం . బాధలో ఉన్న వారందరూ కోలుకోవాలని నా ప్రార్థనలు తెలుపుతున్నాను " అని రాసుకొచ్చారు . ప్రెసెంట్ చిరంజీవి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఇక ఈ పోస్ట్ చూసిన చిరు అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు . చిరు అండ్ అల్లు అర్జున్ ని చూసి నేర్చుకోమంటూ పలువురు హీరోలను తిడుతున్నారు కూడా . ఏదేమైనప్పటికీ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు చిరు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: