రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్.. శేఖర్ భాష పై ఆ కేసు పెట్టిన లావణ్య..!?

frame రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్.. శేఖర్ భాష పై ఆ కేసు పెట్టిన లావణ్య..!?

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో రోజుకు ఒక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. హీరో రాజ్ తరుణ్ తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేశాడు అంటూ లావణ్య ఆరోపిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. రాజ్ తరుణ్ తనను ప్రేమించి రహస్యంగా వివాహం చేసుకొని ఇప్పుడు మాల్వి మల్హోత్రా కోసం తనను వదిలేశాడని లావణ్య ఆరోపిస్తోంది. అయితే దీనిపై రాజ్ త‌రుణ్ స్పందిస్తూ.. లావ‌ణ్య నాపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. ప్రతిదానికి నా ద‌గ్గ‌ర ఆధారం ఉంది. నాకు ఎవ‌రికి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. 

క‌చ్చితంగా నేను లీగ‌ల్‌గానే వెళ‌తాను న్యాయం జరిగే వరకు పోరాడుతా అంటూ ప్ర‌క‌టించాడు. ఈ క్రమంలో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. లావణ్య తమను వేధిస్తోందని వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా ఇందులో మ‌రో కొత్త ట్విస్ట్ వ‌చ్చి చేరింది. లావ‌ణ్య త‌న‌కు డ్ర‌గ్స్ అలవాటు చేసిందంటూ ప్రీతి అనే అమ్మాయి నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. త‌న‌తో పాటు చాలామంది ఆడపిల్లలకు ఆమె డ్రగ్స్‌ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య ఫోన్ చేసి ఇబ్బందులకు గురిచేస్తుందని.. ఆమె వ‌ల్ల చాలామంది జీవితాలు నాశనం అయ్యాయంటూ పిటిష‌న్‌లో

 తెలిపింది.  అయితే మరొవైపు రాజ్ తరుణ్ కు సపోర్ట్ గా శేఖర్ భాష మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఓ టీవీ షో లో లావణ్య , శేఖర్ పాల్గొనగా..శేఖర్ మాట్లాడుతున్న వేళ..లావణ్య చెప్పుతో కొట్టడం తో సంచలనం రేపింది. దీనిపై మీడియా లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో RJ శేఖర్ బాషా నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ లావణ్య పోలీసుల్ని ఆశ్రయించారు. ‘శేఖర్ బాషా నాపై అటాక్ చేశాడు. కడుపులో, నడుము మీద తన్నాడు. 12 మెట్లపై నుంచి కిందకు పడిపోయాను. నన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాను. మొన్న రాత్రి మా ఇంటి కిటికీపై రాళ్లు విసిరారు. అతడి వల్ల నాకు ప్రాణహాని ఉంది. భయమేస్తోంది. నాకేం జరిగినా అతడే కారణం’ అని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. మరి దీనిపై శేఖర్ ఏమంటాడో చూడాలి...!!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: