ఒకప్పటి స్టార్ డైరెక్టర్స్.. ఇప్పుడు హిట్స్ కోసం అష్ట కష్టాలు..?

frame ఒకప్పటి స్టార్ డైరెక్టర్స్.. ఇప్పుడు హిట్స్ కోసం అష్ట కష్టాలు..?

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ట్ డైరెక్టర్లుగా కెరియర్ను కొనసాగించిన వారికి కూడా ఆ తర్వాత అపజయాలు దక్కినట్లయితే వారి క్రేజ్ తగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో వారు మళ్ళి హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లోకి రావాలి అని అనేక ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో కూడా అలాంటి దర్శకులు ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో కెరీర్ ను ప్రారంభించిన తొలినాళ్లలో అద్భుతమైన విజయాలను అందుకొని చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ల స్థాయికి వెళ్లిన వారిలో పూరి జగన్నాథ్ , శ్రీను వైట్ల మొదటి వరుసలో ఉంటారు.

పూరి జగన్నాథ్ ఎక్కువ శాతం మాస్ , కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలతో విజయాలను అందుకుంటే  శ్రీను వైట్ల కమర్షియల్ అండ్ కామెడీ సినిమాలతో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. వీరిద్దరు కూడా కెరియర్ ను దాదాపు ఓకే సమయంలో మొదలు పెట్టారు. అలాగే ఒక సమయంలో హిట్ లను అందుకుంటూ స్టార్ డైరెక్టర్ల స్థాయికి ఎదిగారు. కానీ పూరి జగన్నాథ్ వరస ఫ్లాప్ ల తర్వాత ఇస్మార్ట్ శంకర్ మూవీ తో హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ లైగర్ మూవీ తో భారీ డిజాస్టర్ ను అందుకున్నాడు. తాజాగా ఈ దర్శకుడు రామ్ పోతినేని హీరోగా డబల్ ఈస్మార్ట్ అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ ఆగస్టు 15 వ తేదీన విడుదల కానుంది.

శ్రీను వైట్ల ఆఖరుగా దూకుడు సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు. ప్రస్తుతం ఈ దర్శకుడు గోపీచంద్ హీరోగా విశ్వం అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను మరికొంత కాలంలోనే విడుదల చేయనున్నారు. ఇకపోతే ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లుగా కెరియర్ను కొనసాగించిన ఈ ఇద్దరు కూడా తమ ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని ఫుల్ ఫామ్ లోకి రావాలి అని అనుకుంటున్నారు. మరి ఈ ఇద్దరు దర్శకులు ఈ సినిమాలతో ఏ స్థాయి విజయాలను అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: