ఎప్పుడూ లేనిది బాలయ్యలో ఈ మార్పు ఏంటి.. కారణం అదేనా..?

frame ఎప్పుడూ లేనిది బాలయ్యలో ఈ మార్పు ఏంటి.. కారణం అదేనా..?

MADDIBOINA AJAY KUMAR
నందమూరి నట సింహం బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి మన అందరికీ తెలిసిందే. ఆయన దర్శకులను విపరీతంగా నమ్ముతూ ఉంటారు. దానితో కథను ఒక సారి వినిపించిన తర్వాత ఆ కథ నచ్చింది అంటే డైరెక్టర్ ను గుడ్డిగా నమ్మి వెళ్లిపోతూ ఉంటారు. మళ్ళీ స్టోరీ అడగడం , ఇది ఎందుకు ఇలా తీస్తున్నావు అని అడగడం , ఏమీ ఉండవు.  డైరెక్టర్ ను పూర్తిగా నమ్మి సినిమాలో నటించడమే ఆయనకు తెలుసు. అలా దర్శకులను గుడ్డిగా నమ్మి వారు ఏది చెబితే అది చేసిన సమయాలలో బాలకృష్ణ కు కొన్ని అపజయాలు దక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే ఎంతో మంది దర్శకులు బాలకృష్ణతో పని చేయడం చాలా బాగుంటుంది , ఆయన దర్శకులను ఎంతో బాగా నమ్ముతారు. ఆయన దర్శకులు చెప్పింది తూచా తప్పకుండా చేస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. ఇకపోతే చాలా మంది స్టార్ హీరోలు దర్శకులు చెప్పిన కథను వినడం మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు సన్నివేశాలు ఎలా వస్తున్నాయా అని చూస్తూ ఉంటారు. దానిలో ఏ మాత్రం తప్పులేదు. ఎందుకు అంటే సినిమా బాగా రాకపోతే అప్పుడే సెట్ చేసుకోవడం ఎంతో మంచిది. ఇకపోతే బాలకృష్ణ కూడా వీరి రూట్ లోక్ వెళ్లినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇక బాబి , బాలకృష్ణ కు కథ చెప్పిన తర్వాత ఆ కథ నచ్చి బాలకృష్ణ ఈ మూవీ ని ఓకే చేసిన మధ్య లో సినిమా సన్నివేశాలను చూస్తున్నట్లు , అవసరమైతే రీ షూట్ లు కూడా అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా బాలకృష్ణ తన రూట్ ను మార్చి మిగతా స్టార్ హీరోల పద్ధతి లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా కూడా బాలకృష్ణ ఇదంతా సినిమా సూపర్ సక్సెస్ కావడం కోసమే చేస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: