బాలయ్యలో ఆ రెండు షేడ్స్ ఉన్నాయి... బిగ్ బాస్ దివి..!
ప్రస్తుతం బాలయ్య , బాబి దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో బిగ్ బాస్ దివి కూడా ఓ చిన్న పాత్రలో కనిపించబోతుంది. తాజాగా బిగ్ బాస్ దివి , బాలయ్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తాజాగా దివి మాట్లాడుతూ ... బాలయ్య దగ్గర రెండు షేడ్స్ ఉన్నాయి.
ఒకటి పొలిటికల్ లీడర్ గా ప్రజలను ఎలా చూసుకోవాలి అనేది. మరొకటి సినిమాల్లో నటించేటప్పుడు ఏ విధంగా క్రమశిక్షణ ఉండాలి , తోటి నటి నటులకు ఎలాంటి గౌరవం ఇవ్వాలి అనేది. ఆయన సినిమా సెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అంటే అక్కడ వాతావరణం అంతా మారిపోతూ ఉంటుంది.
ఆయన పెద్ద స్టార్ హీరో కదా సీరియస్ గా ఉంటాడేమో అని అనుకుంటే తప్పు. ఆయన చాలా సరదాగా ఉంటారు. చిన్న స్థాయి నటీనటుల నుండి , పెద్ద స్థాయి వరకు ఎవరితో ఎలా మెలగాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు , గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా. ఆయన స్క్రీన్ ప్రజెంట్ హైలెట్ గా ఉంటుంది. యాక్టింగ్ విషయంలో , డైలాగ్ చెప్పడంలో ఆయన ఇప్పటికీ కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటాడు అని దివి తాజాగా తెలియజేసింది.