దేవర కోసం నాగవంశీ.. ఎంట్రీ ఊహించలేదుగా..?
నాగవంశీ దేవరా సినిమా రెండు రాష్ట్రాల హక్కులను దక్కించుకున్నారట..ఇప్పుడు నాగ వంశీ ఈ దేవరా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఎన్టీఆర్ దేవర సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలలో తానే డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్లు నాగ వంశీ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గతంలో వీరిద్దరూ కలిసి అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా చేశారు . ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు కలెక్షన్లు సునామి కూడా సృష్టించింది.
అందుకే ఎన్టీఆర్ సినిమా ఎలాగో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని భావించిన నాగ వంశీ ఈ సినిమా హక్కులను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు ఎంతవరకు అమ్ముడుపోయాయి అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి అయితే గట్టిరేటే నిర్మాతలు కోట్ చేసి ఉంటారని, ఇక అందుకు తగ్గట్టుగానే నాగ వంశీ కొనుగోలు చేసి ఉంటారని సమాచారం.