VD12 నుండి అదిరిపోయే అప్డేట్..!

frame VD12 నుండి అదిరిపోయే అప్డేట్..!

Anilkumar
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ రొటీన్ గా మారిన విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం VD12తో మరోసారి అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం నుండి ఇప్పటికే వచ్చిన మూడు క్రేజీ అప్డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గౌతమ్ తిన్న నూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గత చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న గౌతమ్ ఈ సారి కూడా విజయ్‌తో మరో హిట్ అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్ లో 12 సినిమాగా ప్రేక్షకుల

 ముందుకు రానుంది. కాగా మొదటి నుంచి కూడా  ఈ సినిమా పట్ల మంచి బజ్ ఉంది. ఇది ఇలా ఉంటే VD12 చిత్రం స్పై థ్రిల్లర్ జానర్‌ లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ జానర్‌ లో విజయ్ నటించడం ఇదే తొలిసారి. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇందులో రఫ్ అండ్ టఫ్ లుక్‌తో కనిపించిన విజయ్ అభిమానులను ఉర్రూతలపాల్చాడు. షార్ట్ హెయిర్, దట్టమైన బీర్డుతో ఎంతో ఇంటెన్స్ గా

 కనిపించిన విజయ్ ఈ చిత్రంపై అంచనాలను పెంచేశాడు. అంతే కాకుండా ఫస్ట్ లుక్‌తో పాటు మరో క్రేజీ అప్డేట్ కూడా వచ్చింది. VD12 చిత్రం 2025 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలియగానే అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా VD12 చిత్ర యూనిట్ తాజాగా శ్రీలంకకు వెళ్లింది. ఇక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అవుతూనే ఉన్నాయి. VD12 చిత్రంపై సోషల్ మీడియాలో భారీ హంగామా నడుస్తోంది. విజయ్ దేవరకొండ అభిమానులు ప్రతి అప్డేట్‌ను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: