టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నాడు.విజయ్ దేవరకొండకి చివరగా ఫ్యామిలీ స్టార్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యామిలీ స్టార్ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.అంతకుముందు నటించిన ఖుషి చిత్రం కూడా యావరేజ్ గా నిలిచింది. దీనితో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో VD12 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ కలిపి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా ఇప్పటికే కొంత భాగాన్ని షూటింగ్ చేయగా మరింత భాగాన్ని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉంది. ఈ సినిమాకు సంబంధించి కొద్ది రోజుల క్రితం శ్రీలంక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా దాదాపు 60 శాతం వరకు చిత్రీకరణ పూర్తయింది.ఇది భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా. VD 12 అనేది వర్కింగ్ టైటిల్. షూటింగ్ ప్రారంభం అయి చాలా రోజులు అవుతోంది. కానీ ఇంతవరకు టైటిల్ ప్రకటించలేదు. గౌతమ్ తిన్ననూరి చిత్రాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. జెర్సీ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అలాంటి డైరెక్టర్ విజయ్ దేవరకొండ లాంటి అగ్రెసివ్ హీరోతో సినిమా చేస్తుంటే ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. తాజాగా VD 12 నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
ఈ చిత్రాన్ని 2025 మార్చి 28న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.అతని విధి అతని కోసం వేచి ఉంది. తప్పులు.. రక్తపాతం.. ప్రశ్నలు.. పునర్జన్మ.. అంటూ షేర్ చేసిన లుక్‌లో వర్షంలో తడుస్తూ, ముఖంపై రక్తంతో ఉన్న విజయ్.. దెబ్బలు తగలడంతో రక్తం వస్తుండగా చాలా కోపంగా పైకి చూస్తూ అరుస్తున్నాడు. మొత్తంగా ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అలాగే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఈ ఆగస్టులో ప్రకటించనున్నట్లు తెలిపింది.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.VD12 చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. పాపులర్ మలయాళ టెక్నీషియన్ గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు.కాగా ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ నుంచి కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ క్రమంలోనే లీక్ అయిన దృశ్యాలను షేర్ చేయొద్దని నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ విజ్ఞప్తి చేసింది. ఈ మూవీలో విజయ్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. గ్యాంగ్‌స్టార్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా స్టోరీ సాగనుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినీ ప్రియుల్లో మంచి అటెన్షన్‌ను క్రియేట్ చేశాయి. పైగా జెర్సీ తర్వాత గౌతమ్ చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి.