నందమూరి నట సింహం
బాలకృష్ణ వరుసగా అఖండ , వీర
సింహా రెడ్డి , భగవంత్
కేసరి మూవీ లతో విజయాలను అందుకున్నాడు. ఇక వరుస విజయాలతో ఫుల్
జోష్ లో ఉన్న
బాలకృష్ణ ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీతో సూపర్ సక్సెస్‌ను అందుకున్న
బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ
సినిమా బాలయ్య కెరియర్లో 109వ సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ
మూవీ యొక్క షూటింగ్‌ను ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ
మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది.
ఈ
మూవీ బృందం ఈ
సినిమా షూటింగ్లో స్టార్ట్ చేసి చాలా కాలమే అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. దానితో ఈ
మూవీ యూనిట్ ఇప్పటికే ఈ
సినిమా నుండి రెండు గ్లిమ్స్ వీడియోలను విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే నిన్న ఈ
సినిమా దర్శకుడు అయినటువంటి బాబి పుట్టిన రోజు దానితో ఈ
మూవీ బృందం ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో బాబి నటులకు ఇస్తున్న సూచనలతో కూడిన ఒక వీడియోను
బాబీ పుట్టిన రోజు సందర్భంగా ఈ
మూవీ యూనిట్ విడుదల చేసింది.
అందులో బాబీతో పాటు అనేక మంది ఎన్బికె 109 సినిమాలో నటిస్తున్న నటీనటులు , టెక్నీషియన్స్ కూడా కనిపించారు. ఇక ఈ వీడియో కూడా అద్భుతమైన స్థాయిలో ఉంది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన అన్ని వీడియోలు అద్భుతమైన స్థాయిలో ఉండడంతో ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇకపోతే
బాలయ్య అభిమానులు ఈ వీడియోల కంటే కూడా ఈ
సినిమా టైటిల్ , విడుదల తేదీలను ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అనే దానిపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. వాటిని విడుదల చేస్తే ఇంకా బాగుంటుంది అని అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తూ వస్తున్నారు.