ప్రభాస్ తో అనుష్క.. సీక్రెట్ గా ఉంచుతున్నారు కానీ..?

shami
ఏంటి ప్రభాస్ తో మరోసారి అనుష్క నటిస్తుందా ఈ విషయం తెలిస్తే రెబల్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆన్ స్క్రీన్ మీద అభిమాన హీరో ఫలానా హీరోయిన్ తో జత కడితే అదిరిపోతుంది అనే ఒక ఆలోచన ఉంటుంది. అలాంటి జోడీనే ప్రభాస్ అనుష్క. బిల్లా, మిర్చి, బాహుబలి ఇలా వారు నటించిన సినిమాలన్నీ ప్రత్యేకంగా నిలిచాయి. బాహుబలిలో ఇద్దరి జోడీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే మళ్లీ మళ్లీ ఈ ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారు.
కానీ బాహుబలి తర్వాత ఆ ఛాన్స్ రాలేదు. మరోపక్క తన లుక్ విషయంలో ఇబ్బంది పడుతూ అనుష్క కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఐతే లేటెస్ట్ గా ప్రభాస్ సినిమాలో అనుష్క ఒక క్యామియో రోల్ చేస్తుందని లేటెస్ట్ టాక్. అది కూడా ఒక క్రేజీ సినిమాలో అని తెలుస్తుంది. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా చేస్తున్న రాజా సాబ్ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఐతే సినిమాలో మరో హీరోయిన్ గా నిధి అగర్వాల్ కూడా ఉంది. ఈ ఇద్దరు కాకుండా అనుష్క కూడా ఈ సినిమాలో స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తుందని టాక్. ప్రభాస్ సినిమాలో అనుష్క కనిపిస్తే చాలు ఆ లెక్క వేరేలా ఉంటుంది. మరోసారి ఈ ఇద్దరు కలిసి హంగామా చేయనున్నారని తెలుస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాజా సాబ్ రాబోతుంది. ఐతే ఈ సినిమా విషయంలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. 2025 ఏప్రిల్ 10న రిలీజ్ లాక్ చేసిన ఈ సినిమా నుంచి ఈమధ్యనే వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేసింది. ప్రభాస్ తో అనుష్క నటిస్తుందన్న ఊహే ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది అదే నిజమైతే తెర మీద ఆ జోడీని చూసి ఫ్యాన్స్ సూపర్ ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: