ఆ విషయంలో గేమ్ చేంజర్ ఎందుకు వెనుకబడింది.. ఎన్ని కారణాలున్నాయా..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా కాలం క్రితం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ ని మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొదలు పెట్టిన సమయంలో ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో అత్యంత భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి ప్రధాన కారణం అప్పటికే రామ్ చరణ్ "ఆర్ ఆర్ ఆర్" మూవీతో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకొని ఉండటం , ఇటు శంకర్ కి పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ ఎప్పటి నుండో ఉండడం , వీరిద్దరి కాంబోలో ఓ మూవీ రూపొందుతుంది అనే విషయం బయటకు రావడంతోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.


ఇక సినిమా స్టార్ట్ అయ్యింది. అంతా సజావుగా జరుగుతున్న సమయంలోనే శంకర్ గతంలో కొంత భాగం పూర్తి చేసిన సినిమా ఇండియన్ 2 మళ్లీ రీ స్టార్ట్ అయింది. దానితోనే ఈ మూవీ కి కష్టాలు మొదలయ్యాయి. ఏకకాలంలో శంకర్ ఈ రెండు మూవీల షూటింగ్స్ ను పూర్తి చేస్తూ రావడంతో గేమ్ చెంజర్ షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. అలా డిలే అవడం ద్వారా కూడా కాస్త ఈ సినిమాపై అంచనాలు తగ్గాయి. కానీ ఇటు శంకర్ "ఇండియన్ 2" మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని కొట్టినట్లు అయితే మళ్లీ గేమ్ చేంజెర్ పై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో పెరుగుతాయి అని జనాలు అనుకున్నారు.


కాకపోతే శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ 2 మూవీ భారీగా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ దెబ్బతో శంకర్ మళ్ళీ గేమ్ చేంజర్ తో ఇండియన్ 2 లాంటి మూవీ ని ఇవ్వడు కదా అనే ఆలోచనలో చర ప్యాన్స్ నిరుత్సాహంగా ఉన్నారు. ఇకపోతే మరి కొంత మంది మాత్రం శంకర్ "గేమ్ చేంజర్" మూవీ ని కార్తీక్ సుబ్బరాజు స్టోరీ తో చేస్తున్నాడు. కాబట్టి ఆ స్టోరీ సూపర్ గా ఉంటుంది. సూపర్ స్టోరీలను శంకర్ ఇంకా బాగా తెరకెక్కిస్తాడు ,  అలాగే దిల్ రాజు కూడా శంకర్ కి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. దానివల్ల కూడా దాని ఔట్పుట్ మరింత బాగుంటుంది గేమ్ చేంజర్ పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే చాలా మంది జనాలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: