"మల్లీశ్వరి" లో హీరోయిన్ పాత్ర కోసం ఎంతమందిని అనుకున్నారో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెంకటేష్ తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. అలా వెంకటేష్ నటించిన మంచి విజయం సాధించిన సినిమాలలో మల్లీశ్వరి మూవీ ఒకటి. ఈ మూవీ లో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించగా ... విజయ్ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే , మాటలను అందించారు.


మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో వెంకటేష్ , కత్రినా కైఫ్ మధ్య సన్నివేశాలు కూడా అద్భుతంగా పండాయి. వీరిద్దరి మధ్య కామెడీతో పాటు ఎమోషనల్ కూడా చాలా పండడంతో వీరి జంటకు కూడా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా ఈ సినిమా దర్శకుడు అయినటువంటి విజయ్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా మల్లీశ్వరి మూవీ గురించి అనేక విషయాలను తెలియజేశారు.


తాజా ఇంటర్వ్యూ లో భాగంగా విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ... మల్లీశ్వరి మూవీ ద్వారా కత్రినా కైఫ్ కు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఆ సినిమాతోనే ఆమె తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇకపోతే మల్లీశ్వరి కథ అనుకున్న తర్వాత హీరోయిన్ గా ఒక యువరాణి లాంటి అమ్మాయి కావాలి. అలాంటి అమ్మాయి కోసం వెతుకుతున్నప్పుడు నేను ఒక యాడ్ లో కత్రినా కైఫ్ ను చూశాను. ఆ అమ్మాయి మల్లీశ్వరి మూవీ లో హీరోయిన్ గా బాగుంటుంది అనుకున్నాను. కానీ ఆమెను సంప్రదిస్తే ఆమె సినిమా చేయను అని చెప్పింది. దానితో అనేక మంది మోడల్స్ ను , హీరోయిన్ లను చూసాం. కానీ ఎవరు సాటిస్ఫై అనిపించలేదు. ఇక చివరగా ఆమె సినిమా చేస్తాను అంది. దానితో ఆమెనే సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kk

సంబంధిత వార్తలు: