అమలాపాల్ కురచ దుస్తులు దేనికి సంకేతం?

Suma Kallamadi
సాధారణంగా సినిమా హీరోయిన్లు అంటేనే గ్లామర్ అనే పరిస్థితికి వచ్చాయి మన సినిమా పరిశ్రమలు. ఓ రకంగా వారికి అందుకే కోట్ల రూపంలో రెమ్యూనరేషన్ ఇస్తుంటారని చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రేక్షకులు కూడా హీరోయిన్ అందచందాలను చూడడానికే సినిమాకు వెళుతున్నారు అనే నానుడి ఉండనే ఉంది. ఇది తొలినాళ్ళ నుంచి బాగా ముదిరిపోయింది. అందుకే హీరోయిన్లు కూడా ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. అదే వైఖరి వారు బయటకు వెళ్ళినప్పుడు కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మన హీరోయిన్లు బయట మీటింగులకు వెళ్ళినప్పుడు ఫ్యాషన్ బేస్డ్ దుస్తులను ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారిపై ఎన్ని విమర్శలను వచ్చినా వాటిని పెద్దగా పట్టించుకోరు. అయితే కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎలా తయారవ్వాలి అనేది వారి విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఇక విషయంలోకి వెళితే తమిళ భామ అమలాపాల్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. మొదటి నుండి ఈ అమ్మడు గ్లామర్ రోల్స్ చేయడంలో పెద్దదిట్ట అని చెప్పుకోవచ్చు. అయితే అది సినిమాల వరకు పరిమితం అయితే బాగుంటుంది కానీ, బయట వాతావరణం లో తిరిగినప్పుడు కూడా ఆమె అదే వైఖరిని ప్రదర్శిస్తుంది. అలవాటే ఇప్పుడు పలు విమర్శలకు దారితీస్తోంది. ఆమె తాజాగా ఎర్నాకులంలోని ఓ కాలేజ్ ఈవెంట్ కు వెళ్లడం జరిగినది. ఆ సందర్భంగా ఆమె నల్లటి పొట్టి వస్త్రాలను ధరించింది. ఇదిగో అక్కడే వచ్చింది అసలు చిక్కు.
దానికి సంబంధించిన ఈవెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... సోషల్ మీడియా ప్రేక్షకులు ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు. కనీసం కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా తమ వైఖరి ఏ మాత్రం మార్చుకోరా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆమె తాజాగా ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. " నేను ఆ కాలేజ్ వేదికగా ఆ దుస్తులను ధరించి మాట్లాడినప్పుడు అక్కడ నాకు పెద్దగా సమస్య కనబడలేదు. ఆ దుస్తులు నాకు చాలా సౌకర్యవంతంగా అనిపించాయి. నేటి యువత కూడా దుస్తుల విషయంలో ఎన్నో అపోహాలను కలిగి ఉంటారు. అలాంటి వాటిని పోగొట్టాలి అని నేను అలా వెళ్లడం జరిగింది.. ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు... అనవసరంగా ఇష్యూ చేయొద్దు! అంటూ ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: