ఆర్ ఆర్ ఆర్ సినిమా రికార్డును బ్రేక్ చెయ్యబోతున్న డార్లింగ్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఆసక్తికరమైన కలెక్షన్లను రాబడుతుంది. ఇప్పటికే చాలా రికార్డులను తిరగరాసింది. జూన్ 27న రిలీజైనా ఈ చిత్రం ఘనవిజయాన్ని అందుకుంది. వైజయంతీ మూవీస్‌ పతాకంపై ప్రియాంక దత్‌, స్వప్నదత్‌ ఈ సినిమా నిర్మించారు. లెజండరీ నటులు అమితాబచ్చన్‌, కమల్‌హాసన్‌ ఈ మూవీలో కీలక

 పాత్రలు పోషించి ‘కల్కి’ విజయంలో ముఖ్యభూమిక పోషించారు. సినిమా విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 1000 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ మూవీ ఇప్పటివరకు ఎన్నో రికార్డులు నెలకొల్పింది.  ముఖ్యంగా ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.  ఇండియన్ హిస్టరీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల జాబితాలో మాత్రం ఈ సినిమా ఐదవ స్థానం దక్కించుకుంది. ఇక అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సౌత్ ఇండియన్ సినిమాల జాబితాలో మాత్రం నాలుగో స్థానంతో ఈ సినిమా

 సరిపెట్టుకుంది. ఈ జాబితాలో మొదటి స్థానంలో బాహుబలి 2 ఉండగా రెండో స్థానంలో ఆర్ఆర్ఆర్ మూడో స్థానంలో కేజిఎఫ్ చాప్టర్ 2 ఉన్నాయి. 1220 కోట్ల రూపాయల కలెక్షన్లతో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన  కల్కి నాలుగో స్థానానికి సరిపెట్టుకుంది. అయితే సరైన సాలిడ్ సినిమా ఏది పడక పోవడంతో ఈ కలెక్షన్లు మరిన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ దరిదాపుల్లోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే కల్కి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం స్పిరిట్ రాజా సాబ్ వంటి సినిమాలను లైన్లో పెట్టాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: