హైపర్ ఆదికి ఎమ్మెల్సీ పదవి.. క్లారిటీ ఇచ్చేశాడుగా..?

praveen
Uజబర్దస్త్‌ కమెడియన్ హైపర్ ఆది సొంత కృషి, టాలెంట్‌తో చాలా పేరు తెచ్చుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ అదిరిపోయే పంచులతో కడుపుబ్బా నవ్వించగల సెన్స్ ఆఫ్ హ్యూమర్ అతడి సొంతం.  కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. జబర్దస్త్ స్కిట్స్‌కే కాదు సినిమాలకి, ఇతర షోలకు కూడా స్క్రిప్స్ రాస్తూ బాగా బిజీ అయిపోయాడు. ఈ నటుడి స్కిట్స్ యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్ తో సాధిస్తుంటాయి. సినిమాల్లో కూడా అప్పుడప్పుడు నటిస్తుంటాడు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇతర మూవీ ఫంక్షన్లకూ ఆదిని స్పెషల్ గెస్ట్ గా పిలుస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. పవన్ వెంట ప్రత్యక్షంగా నడిచాడు. హైపర్ ఆది చిన్నప్పటి నుంచి పవన్‌కు పెద్ద ఫ్యాన్. ఎప్పుడూ ఆయనకు సపోర్టర్ గా నిలుస్తూ వచ్చాడు. జనసేన పార్టీలో కూడా జాయిన్ అయ్యాడు. 2019 అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్టీలో అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. 2024 ఎన్నికల్లో పార్టీ నిర్వహించిన పెద్ద సభల్లో అదిరిపోయే ప్రసంగాలు ఇచ్చి అభిమానులు, కార్యకర్తల్లో జోష్ నింపాడు.
జనసేన గెలవడం తప్పనిసరి అయిన 2024 ఎన్నికల్లో హైపర్ ఆది మెచ్చుకోదగిన సేవలు అందించాడు. పిఠాపురంలో మకాం వేసి సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, కిరాక్ ఆర్పీలను ఏకం చేసి ఇంటింటికి ప్రచారం చేశాడు హైపర్ ఆది. వైసీపీపై ఫన్నీగా పంచ్‌లు వేస్తూ జనాల్లో జనసేనకు మంచి మద్దతు లభించేలా చేశాడు. పిఠాపురంలోనే కాదు ఇతర నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్ధుల కోసం ప్రచారం చేశాడు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చిందంటే అందులో హైపర్ ఆది కృషి కాస్తయినా ఉంటుంది. పవన్ కళ్యాణ్ చాలా అవమానాలు, ఛీత్కారాలను భరించి చివరికి భారీ విజయం సొంతం చేసుకున్నారు. తన విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటానని పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో మాట్లాడారు. అంతేకాదు ఆ మాటను నిలబెట్టుకున్నారు. పార్టీ పెట్టిన సమయం నుంచి తన వెంటే అండగా ఉన్న పి.హరిప్రసాద్‌ను ఎమ్మెల్సీని చేసి గొప్ప మనసును చాటుకున్నారు. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. జనసేన పార్టీ నేతల్లో కొందరికి పెద్ద పదవులు రానున్నాయి.
హైపర్ ఆదికి కూడా ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారని, అతడిని చట్టసభలోకి పంపాలని పవన్ నిర్ణయించారని రీసెంట్ గా బాగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు పై తాజాగా కమెడియన్ హైపర్ ఆది స్పందించాడు. ఈ యాక్టర్ "శివం భజే" మూవీలో నటిస్తున్నాడు. మంగళవారం నాడు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత ఆది ప్రెస్‌మీట్‌లో మాట్లాడాడు ఇదే సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన కోసం ఎన్నికల్లో ప్రచారం చేశానని, ఆయన మంచి మనసును గ్రహించి ప్రజలు గెలిపించారని అన్నాడు.
అలానే తనకు ఎలాంటి ఎమ్మెల్సీ, ఇతర పదవులపై ఇంటరెస్ట్ లేదని స్పష్టం చేశాడు. పదవుల కోసం ప్రచారం చేయలేదని, పవన్ అంటే ఇష్టంతో ప్రచారం చేశానని అన్నాడు తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఆది  కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mlc

సంబంధిత వార్తలు: