నానితో యానిమల్.. తలుచుకుంటేనే గూస్ బంప్స్..!?

Anilkumar
స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ  గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అర్జున్ రెడ్డి యానిమల్ కబీర్ సింగ్ వంటి సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు సందీప్ రెడ్డి.  అయితే ఈ సినిమాల తరువాత తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకి స్పిరిట్ అని టైటిల్ సైతం ఫిక్స్ చేశారు. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు  ఉన్నాయి.  ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నారు. ఆయన లేటెస్ట్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’ బ్లాక్బస్టర్

 హిట్ అయింది. ఈ చిత్రంతో రూ.1,000 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టారు ప్రభాస్. ‘బాహుబలి 2’ తర్వాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ను ‘కల్కి’తో చూశారాయన. వెయ్యి కోట్ల మార్క్ను అందుకోవడం రెబల్ స్టార్ కెరీర్లో ఇది రెండోసారి కావడం విశేషం. ఈ ఫిల్మ్ రిలీజై రెండు వారాలైనా బాక్సాఫీస్ వద్ద ఇంకా హవా అలాగే నడుస్తోంది. నాగ్ అశ్విన్ మేకింగ్, ప్రభాస్తో పాటు అమితాబ్, దీపికా, కమల్ హాసన్ నటన, విజువల్ ఎఫెక్ట్స్, మహాభారతం ఎపిసోడ్స్ సినిమాను మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నాయి. ‘కల్కి’ ఊహించని విజయం సాధించడంతో నెక్స్ట్ ఫిల్మ్పై

 ప్రభాస్ ఫోకస్ పెడుతున్నారు.  అయితే ఈమధ్య ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రెడ్డి నాని కలిసి స్పెషల్ చిట్ చాట్ చేశారు. దానిలో సందీప్ వంగ నానితో కూడా సినిమా చేయాలనుకున్నారన్న విషయాన్ని వెల్లడించారు. ఐతే నానితో సందీప్ వంగానా బాబోయ్ అనేస్తున్నారు. సందీప్ వంగ  సినిమాలు కమర్షియల్ గా సూపర్ సక్సెస్ లు అందుకుంటున్నా.. యూత్ ఆడియన్స్ వారెవా అనేస్తున్నా కొంతమంది మాత్రం అతని బోల్డ్ అటెంప్ట్ ని తప్పుపడుతున్నారు. దానికి కారణం కూడా ఇది అని చెప్పడం కష్టం. అయితే సినిమా అన్న తర్వాత ఎవరి ఒపీనియన్ వారికి ఉంటుంది. నానితో సందీప్ సినిమా చేస్తే ఎలాంటి సినిమా చేస్తాడన్న డౌట్లు మొదలయ్యాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: