భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న సందీప్ కిషన్.. అందుకే పెళ్లికి దూరమా..?

Pandrala Sravanthi
సందీప్ కిషన్.. తెలుగు లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్న ఈ హీరోకి సరైన హిట్స్ పడడం లేదు. ఈయన రీసెంట్ గా ఊరు పేరు భైరవకోన అనే మూవీ తో మన ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా ఓకే టాక్ తెచ్చుకున్నప్పటికీ బ్లాక్ బస్టర్ అయితే కాలేదు.దాంతో నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టారు. అయితే సందీప్ కిషన్ ధనుష్ హీరోగా చేసిన రాయన్ మూవీలో ఒక కీలక పాత్రలో నటించారు. రాయల్ మూవీ జులై 26న విడుదలకు సిద్ధంగా ఉంది.ఇక ఈ సినిమా విడుదల కాబోతుండడంతో వరుసగా చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు సందీప్ కిషన్. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లో తనకి సంబంధించిన ఒక సీక్రెట్ విషయాన్ని బయట పెట్టారు. అదేంటంటే.. సందీప్ కిషన్ గత కొద్ది రోజులుగా ఓ వ్యాధితో బాధపడుతున్నారట. ఇక తనకి ఉన్న వ్యాధి గురించి సందీప్ కిషన్ ఓపెన్ గానే చెప్పేశారు.మరి ఇంతకీ సందీప్ కిషన్ కి ఉన్న వ్యాధి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 


సందీప్ కిషన్ ప్రస్థానం, స్నేహగీతం వంటి సినిమాలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈయనకు గుర్తింపునిచ్చింది రొటీన్ లవ్ స్టోరీ. ఇక రకుల్ ప్రీత్ సింగ్ తో చేసిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సందీప్ కిషన్ ని హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసింది. అలా వరుస సినిమాలు చేస్తూ జోరు మీదున్న ఈ హీరో తనకు సంబంధించిన ఒక సీక్రెట్ విషయాన్ని బయటపెట్టారు.అదేంటంటే.. సందీప్ కిషన్ కి దుమ్ము,ధూళి అంటే అస్సలు పడదట. ఎందుకంటే ఆయనకు బ్రీతింగ్, సైనస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయట.అందుకే డస్ట్ ఉండే దగ్గర షూటింగ్ చేస్తే ఆయనకు కాస్త ఇబ్బంది తలెత్తుందట.అయితే ఓ సినిమా షూటింగ్ సమయంలో పూర్తిగా డస్ట్,పొగ ఉన్న సీన్లో చేయాల్సి వచ్చిందట.దాంతో ఆయనకు ఊపిరాడక అల్లాడిపోయారట.


 ఇక ఈ విషయం తెలుసుకున్న చిత్ర యూనిట్ అంబులెన్స్ కి ఫోన్ చేద్దాం అన్నారట.కానీ సందీప్ కిషన్ నన్ను ఒక పది నిమిషాలు వదిలేయండి అని చెప్పేసి ప్రశాంతంగా ఉన్న ప్లేస్ కి వచ్చి పది నిమిషాలు రెస్ట్ తీసుకున్నారట. ఆ తర్వాత మళ్లీ షూటింగ్లో జాయిన్ అయ్యారట. అలా బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల డస్ట్ ఎక్కువగా ఉండే సన్నివేశాల్లో నటిస్తే తనకి కాస్త ఆరోగ్య సమస్యలు వస్తాయని తాజా ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సందీప్ కిషన్ చెప్పిన విషయం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో కొంతమంది నెటిజన్స్ సందీప్ కిషన్ గురించి మాట్లాడుతూ..సైనస్, బ్రీతింగ్ ప్రాబ్లెమ్స్ వల్లే పెళ్లికి దూరంగా ఉంటున్నారా.. పెళ్లెప్పుడు చేసుకుంటారు అంటూ నెట్టింట్లో కామెంట్స్ పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: