ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు అంటే ఇప్పటి జనరేషన్ వాళ్లకు తెలియకపోవచ్చు. కానీ ప్రభాస్ తండ్రి అంటే మాత్రం సుపరిచితమే. కృష్ణంరాజు తమ్ముడిగా ఇండస్ట్రీలోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన ఈయన గోపికృష్ణ బ్యానర్ పై కొన్ని సినిమాలను నిర్మించారు. అయితే అలాంటి ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ నిజంగానే ఆ నిర్మాతను చంపాలని ప్లాన్ చేశారా.. ఎందుకు ఆ నిర్మాతని చంపాలి అనుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఏలిన హీరోలలో కృష్ణంరాజు కూడా ఒకరు. ఈయన కేవలం హీరో గానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విలన్ గా... తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.ఇక ఈయన చెప్పిన కత్తందుకో జానకి అనే డైలాగ్ ఇప్పటికి కూడా ఫేమస్..
అయితే కృష్ణంరాజుకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోవడంతో సినిమాల్లోకి రావడానికి చాలానే కష్టపడ్డారట. అలా ఓసారి ఈయనను హీరోగా పెట్టి ఓ నిర్మాత సినిమా తీయాలి అని 20 వేల అడ్వాన్స్ ఇచ్చారట. కానీ ఆ తర్వాత డైరెక్టర్,నిర్మాత మాట్లాడుకొని ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ చివరికి కృష్ణంరాజుని హీరోగా తప్పించి మరో హీరోకి ఛాన్స్ ఇచ్చి మొదట ఇచ్చిన 20వేలు కూడా తిరిగి ఇచ్చేయమన్నారట.ఇక 20వేలు అడిగే సమయంలో పెద్ద రచ్చ చేసి అప్పట్లో ఇండస్ట్రీలో పెద్దగా ఉన్న డివిఎస్ రాజు దగ్గరికి పిలిపించారట.ఇక కృష్ణంరాజు ఆయన దగ్గరికి వెళ్లి 20 వేల అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తూ ఓ మాట చెప్పారట..
ఆ డైరెక్టర్ నిర్మాత కలిసి నా సినీ కెరీర్ మీద ఏదో కుట్ర చేస్తున్నారు.ఇప్పటికే ఈ విషయం నా తమ్ముడికి తెలిసిపోయింది.ఆ నిర్మాత నాపై కుట్రలు ఆపకపోతే కచ్చితంగా నా తమ్ముడు ఊరుకోడు. దొరికితే ఎప్పుడు చంపేద్దామా అన్నంత కోపంలో ఉన్నాడు.ఇక తర్వాత మీ ఇష్టం అని వార్నింగ్ ఇచ్చారట. అలా ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు అన్న కృష్ణంరాజు కోసం ఓ నిర్మాతని చంపాలని కూడా అనుకున్నారట.ఇక ఆ నిర్మాత ఎవరో కాదు జీఎస్ రాజు అని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం లో కృష్ణంరాజు పాల్గొన్న సమయంలో ఈ విషయాన్ని బయట పెట్టారు