దేవరకి తలనొప్పిగా మారిన అనిరుధ్?

Purushottham Vinay

దేవర సినిమాకి యూనివర్శల్ గా అందరికి రీచ్ అయ్యే మ్యూజిక్ కావాలని కొరటాల శివ ఏరికోరి మరి అనిరుద్ రవి చందర్ ని ఎంపిక చేసుకున్నారు. తెలుగులో అనిరుద్ వర్క్ చేసిన సినిమాలు ఇప్పటి దాకా ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా హిట్ కాలేదు. అయిన కూడా అనిరుద్ టాలెంట్ మీద నమ్మకంతో దేవర సినిమా కోసం కొరటాలా ఎంపిక చేశారు.రీసెంట్ గా దేవర సినిమా టైటిల్ సాంగ్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ సాంగ్ సూపర్ గా ఉందనే టాక్ అయితే రాలేదు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం బాగానే కనెక్ట్ అయ్యింది. ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.మూవీ యూనిట్ సాంగ్స్ కోసం వెయిట్ చేస్తుందంట. అనిరుద్ రవిచందర్ కేవలం తమిళ్ సినిమాలకి మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూపోతున్నాడు. అందుకే దేవర సినిమా సాంగ్స్ ని ఆలస్యం చేస్తున్నాడనే టాక్ వైరల్ అవుతోంది. ఇప్పుడే కాదు గతంలో కూడా అనిరుద్ తెలుగు సినిమాలు చేసే సమయంలో చాలా ఎక్కువ జాప్యం చేస్తాడనే ఆరోపణలు వచ్చాయి. అలాగే కోలీవుడ్ సినిమాలకి ఇచ్చినంత బెస్ట్ మ్యూజిక్ తెలుగు చిత్రాలకి మాత్రం అనిరుద్ ఇవ్వడని విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. దేవర మూవీ విషయంలో కూడా అనిరుద్ అదే పాత వైఖరిని అవలంబిస్తున్నాడనే కొత్త టాక్ మళ్ళీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 


నిజానికి జూన్ నెల లోనే దేవర మూవీ సాంగ్ కోసం ట్యూన్ ఇవ్వాల్సి ఉందట. అయితే ఇప్పటి దాకా అతను ట్యూన్ కంపోజ్ చేసి ఇవ్వలేదనే సమాచారం వినిపిస్తోంది. దీంతో అనిరుద్ రవి చందర్ ఇచ్చే ట్యూన్ కోసం లిరిక్ రైటర్ ఎంతగానో వెయిట్ చేస్తున్నాడట.నిజానికి సెకండ్ సింగిల్ ని కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. అనిరుద్ ట్యూన్ ఇవ్వకపోవడం వలన ఆలస్యం అవుతున్నట్లు సమాచారం తెలుస్తోంది. అనిరుద్ ఇండియన్ 2 సినిమాకి మ్యూజిక్ ని అందించారు. అయితే ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని మ్యూజిక్ పరంగా రీచ్ అవడంలో అనిరుద్ రవి చందర్ ఫెయిల్ అయ్యాడనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ప్రస్తుతం తమిళంలో అరడజను సినిమాల దాకా అతని చేతిలో ఉన్నాయి. దీంతో దేవర సినిమాకి ప్రయారిటీ తగ్గించి తమిళ్ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడనే మాట కూడా బలంగా వినిపిస్తోంది. అనిరుద్ రవి చందర్ విధానంతో దేవర మూవీకి అనవసరమైన తలనొప్పి కొత్తగా మొదలైందనే ప్రచారం టాలీవుడ్ సర్కిల్ లో నడుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దేవర సినిమాకు అనిరుద్ బెస్ట్ మ్యూజిక్ అందించకపోతే మాత్రం టాలీవుడ్ లో మళ్ళీ పెద్ద సినిమాల అవకాశాలు తగ్గే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: