భారతీయుడు పార్ట్ 3 రిలీజ్ అప్పుడేనా..?

murali krishna
సుమారు 28 సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా అప్పట్లో ఎంతటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుందో  చెప్పనవసరం లేదు. స్టార్ డైరెక్టర్ శంకర్ లోక నాయకుడు కమలహాసన్ కాంబోలో వచ్చిన ఆ సినిమాకి సీక్వల్ గా ఇప్పుడు భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ సీక్వెల్ ను కూడా రెండు భాగాలుగా తీశారు. మొదటి భాగం భారతీయుడు 2.అయితే ఈ సినిమా ఎండింగ్ లో భారతీయుడు త్రీ ట్రైలర్ కూడా జత చేశాడు డైరెక్టర్. ఇక ఆ ట్రైలర్ ప్రస్తుతం నటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. అయితే ఈ ట్రైలర్ చూస్తుంటే అసలు కథ మొత్తం పార్ట్ 3 లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇండియన్-2కు సీక్వెల్ గా ఇండియన్-3 కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీకి కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.ఇండియన్-2 సినిమాతో పాటు ఇండియన్-3 సినిమా షూటింగ్ కూడా పూర్తిచేశారంట.కాకపోతే కొంత ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ లో ఉందంట. భారతీయుడు 3 గతం లో ప్రకటించినట్లుగానే 2025లో రిలీజ్ అవుతుందని డైరెక్టర్ శంకర్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.భారతీయుడు 2కి నెగటివ్ టాక్ రావడంతో మూడో పార్ట్ పనులు ఆగిపోనున్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసాయి.సెకండ్ పార్ట్ కంటే థర్డ్ పార్ట్ తనకు బాగా నచ్చిందని కమల్ చెప్పిన సంగతి తెలిసిందే.

భారతీయుడు 3కి సంబంధించిన లెంగ్తీ ట్రైలర్‌ పార్ట్‌ 2తో పాటు యాడ్ చేశారు. పార్ట్ 3 ట్రైలర్ చూశాక ఆడియన్స్‌కి కూడా కంటెంట్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. సేనాపతి అసలు కథ అంతా త్రీక్వెల్‌లోనే చూపించబోతున్నారు మేకర్స్‌.పార్ట్ 2లో ఫోకస్‌ అంతా ప్రజెంట్ సోసైటీ ఎలా ఉంది, భారతీయుడు మళ్లీ రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అన్న దాని మీదే ఫోకస్ చేశారు. నెక్ట్స్‌ పార్ట్‌లో సేనాపతి గతం ఏంటో చూపించబోతున్నారు శంకర్‌.అంతేకాదు పార్ట్‌ 3లో యంగ్ కమల్‌ హాసన్‌ ఆడియన్స్‌ను అలరించబోతున్నారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొనక ముందు సేనాపతి ఎవరు..? అతని కుటుంబ నేపథ్యం ఏంటి? లాంటి డిటైల్స్‌ కూడా పార్ట్ 3లో చూపించబోతున్నారు.ఆల్రెడీ భారతీయుడు 3 షూటింగ్ పూర్తయ్యింది వార్ మోడ్ అనే ట్యాగ్‌ లైన్‌తో రూపొందిన ఈ సినిమా నెక్ట్స్ ఇయర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో కమల్‌ హాసన్‌ 1996 రోజులను మళ్లీ గుర్తు చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: