బన్నీ, సుకుమార్ ఇష్యూ పై క్లారిటీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత..ఏమన్నారంటే..?

murali krishna
పుష్ప సీక్వెల్‌ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్న హ్యాష్‌ట్యాగ్‌. హీరో అల్లు అర్జున్‌కీ, కెప్టెన్‌ సుకుమార్‌కీ గొడవైందా? అల్లు అర్జున్‌ గడ్డం ట్రిమ్‌ చేయడానికి రీజన్‌ ఏంటి? హీరో, డైరక్టర్‌ తలో దారిన ఎక్కడికి వెళ్లారు? ఇంతకీ ఈ ఏడాది డిసెంబర్‌లో సినిమా రిలీజ్‌ అవుతుందా.?లేకుంటే నెక్స్ట్ ఇయర్‌కి వాయిదా పడుతుందా? సోషల్‌ మీడియా సెగ మామూలుగా లేదు మరి.. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్పరాజ్‌ టాపిక్కే. బన్నీ అసలు గడ్డం ఎందుకు తీసేశారు? సుకుమార్‌తో గొడవైందటగా, సుకుమార్‌ తీస్తున్న సన్నివేశాలు నచ్చడం లేదటగా.. అందుకే ఈ విధంగా నిరసన చెప్పారటగా.. అంటూ ఏవేవో విషయాలు వైరల్‌ అవుతున్నాయి.తాజాగా ఈ బన్నీ, సుకుమార్ గొడవ గురించి వస్తున్న వార్తలపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ‘ఆయ్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. “’ఆయ్’ సినిమా ప్రమోషన్ లో సుకుమార్ విషయం గురించి మాట్లాడితే కరెక్ట్ కాదు. ఆ విషయం చెప్తే.. ఈ సినిమా ప్రమోషన్ మొత్తం ఎగిరిపోతుంది. 

నిజం చెప్పాలంటే, రెండు రోజుల క్రితం బన్నీ, సుకుమార్ గొడవకు సంబంధించి ఓ ఫ్రెండ్ పంపితే రెండు మూడు ఆర్టికల్స్ చదివాను. లోపల ఏం జరుగుతుంది? అనేది సుకుమార్ గారు, బన్నీ గారు, ప్రొడ్యూసర్స్ తర్వాత అత్యంత సన్నిహితంగా తెలిసింది నాకే. ఆ ఆర్టికల్ చూసి నవ్వుకున్నాం. మాకు పబ్లిసిటీ బాగా వస్తుంది. ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారు. అలాగే కానివ్వండి అనుకున్నాం. ‘పుష్ప 2’ సినిమాలో బన్నీగారు మరో 15 రోజులు కేటాయిస్తే సరిపోతుంది. క్లైమాక్స్, ఓ సాంగ్ మాత్రమే పెండింగ్ లో ఉంది. సుకుమార్ గారు చెప్పిందేంటంటే? ముందుగా ఎడిటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత బన్నీ పార్ట్ కంప్లీట్ చేయాలంటున్నారు. ఒకేసారి క్లైమాక్స్, సాంగ్ తో పాటు ప్యాచ్ వర్క్ కూడా తీసేసుకోవాలి అనుకున్నారు. ఎడిటింగ్‌కు నెల రోజుల టైమ్ పడుతుంది. ఆ గ్యాప్ లో మళ్లీ గడ్డం వచ్చేలా షేవ్ చేసుకున్నాడు. 

ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెకేషన్ కు వెళ్లారు. దాన్ని అందరూ కలిసి బీభత్సం చేశారు. సుకుమార్‌తో నాకు, బన్నీకి స్పెషల్ బాండింగ్ ఉంది. ఇంకో 6 నెలలు షూటింగ్ చేసినా బన్నీ గారు వచ్చేందుకు సిధ్దంగా ఉన్నారు. ‘పుష్ప‘ అనేది వారి కెరీర్‌కు ఎంతో వెయిట్ తీసుకొచ్చింది. రాసుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ, వారి ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. వారి వారి పనుల్లో బిజీ గా ఉన్నారు. ఆగష్టు తొలివారంలో మరో షెడ్యూల్ మొదలవుతుంది” అని బన్నీవాస్ వివరించారు.పుష్ప: ది రూల్' షూటింగ్ ఆలస్యమైంది మరియు విడుదల తేదీ చాలాసార్లు వాయిదా పడింది. ముందుగా ఈ సినిమా ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే, ప్రొడక్షన్ మరియు వియఫ్ఎక్స్ ఆలస్యం కారణంగా, మేకర్స్ సినిమా విడుదలను డిసెంబర్ 6 కి వాయిదా వేశారు .'పుష్ప: ది రూల్' చిత్రంలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్ మరియు అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: