గ్లోబల్ స్టార్ కి దక్కిన అరుదైన గౌరవం..!!

murali krishna
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి... తండ్రిని మించిన నటుడుగా రామ్ చరణ్ గుర్తింపు సాధించుకున్నాడు.రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేజంర్ అనే ఓ భారీ సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఇదిలా ఉండగా ది ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్(ఐఎఫ్ఎఫ్ఎం) 15వ‌ ఎడిష‌న్‌కు గెస్ట్ ఆఫ్ హాన‌ర్ అవార్డును గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అందుకోనున్నాడు. ఈ విష‌యాన్ని ఐఎఫ్ఎఫ్ఎం అధికారికంగా శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. రామ్ చ‌ర‌ణ్‌ను ఉద్దేశించి ఐఎఫ్ఎఫ్ఎం చేసిన  పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ అవార్డును అందుకోనున్న తొలి ఇండియ‌న్ హీరోగా రామ్‌చ‌ర‌ణ్ నిల‌వ‌నున్నాడు.మెల్‌బోర్న్‌లో జ‌ర‌గ‌నున్న ఈ ఇండియ‌న్ సినీ అవార్డుల‌కు రామ్ చ‌ర‌ణ్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ త‌న స్టార్ పవ‌ర్‌ను జోడించ‌బోతున్నాడు. ఈ వేడకకు రామ్‌చరణ్ అతిథిగా వెళ్లడమే కాదు భారతీయ సినిమాకి చేసిన సేవలకు గాను ను ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్ అవార్డును సైతం ఆయన అందుకోనున్నారు.ది ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్‌ను ఆస్ట్రేలియాలోని విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం ఏటా అధికారికంగా నిర్వ‌హిస్తుంది. ఈ ఏడాది ఈ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆగ‌స్ట్‌ 15-25 వ‌ర‌కు జ‌రుగ‌నుంది.
ఈ కార్యక్రమానికి A.R రెహమాన్, కరణ్ జోహన్, రాజ్ కుమార్ హిరానీ, ఇంతియాజ్ అలీ, కబీర్ ఖాన్ వంటి దర్శకులు, నిర్మాతలు కూడా హాజరు కానున్నారు. అయితే హీరోల్లో రామ్ చరణ్ మాత్రమే ఉండటం విశేషం. అయితే రామ్ చరణ్ కు ఇలా మరో అరుదైన ఘనత దక్కడంతో ఈ క్రెడిట్ అంతా కూడా క్లీంకార అదే తన పుట్టిన తర్వాతనే మెగా ఇంట్లో ఇలా ఒకదాని తర్వాత ఒకటి మంచి మంచి విషయాలు జరుగుతున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు చెర్రీ అభిమానులు. ఆ చిట్టి తల్లి పుట్టిన తర్వాత అంతా శుభమే జరుగుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: