సూర్య కంగువ నుండి సాంగ్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..!?

Anilkumar
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి అందరికీ పరిచయం చేయక్కర్లేదు. కోలీవుడ్ లోనే కాకుండా  టాలీవుడ్ లో కూడా ఈయనకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు ఈ స్టార్ హీరో. ఇదిలా ఉండగా ఈయన తాజాగా శివ దర్శకత్వంలో "కంగువ" అనే సినిమా చేస్తున్నారు. ఇక ఇందులో బాలీవుడ్ నటుడు బాబి డియోల్ మరియు స్టార్ హీరోయిన్ దిశా పటాని పలు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, కె.వి.న్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్ల పై భారీ బడ్జెట్ తో

 ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఇప్పుడు ఈ మూవీ నుంచి ఫెయినల్ సాంగ్ ను  మేకర్స్ విడుదల చేయనున్నారు. ఇక దానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకున్నారు. జూలై 23వ తేదీన ఈ పాట విడుదల కానుంది. ఇక ఈ విషయాన్ని మేకర్స్ అంతా ప్రేక్షకులకు తెలియజేసేందుకు సోషల్ మీడియాలో ఒక పోస్టర్ ను అప్లోడ్ చేశారు. ఇక ఆ పోస్టుని చూసినా అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా  పాట

 కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. కాగా ఈ సినిమాను అక్టోబర్ 10 2024 న వరల్డ్ వైడ్ గా భారీ బడ్జెట్ తో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఈ స్టార్ హీరో ఎంతటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ఈ స్టార్ హీరో "సూర్య 44" అనే సినిమా కూడా చేయనున్నారు. ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తుండగా ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: