బాలయ్య ఇలా.. నాగ్ అలా.. అయోమయంలో ఫ్యాన్స్..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి నట సింహం బాలకృష్ణ , టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కూడా ఉంటారు. వీరిద్దరు కూడా ఎన్నో సంవత్సరాల నుండి తెలుగులో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలుగా కెరియర్ ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ కూడా వీరు మంచి విజయాలను అందుకుంటు ఫుల్ జోష్ లో ముందుకు సాగుతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మేకర్స్ ఇప్పటివరకు కూడా టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.

దానితో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది. అయినప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను విడుదల చేయలేదు. అలాగే ఈ మూవీ యొక్క విడుదల తేదీని అనౌన్స్ చేయలేదు. దానితో ఈ సినిమాకు ఫలానా టైటిల్ ను అనుకుంటున్నారు అని రోజుకో వార్త వస్తుంది. అలాగే ఈ మూవీ ని ఆ సమయంలో విడుదల చేయబోతున్నారు అని కూడా అనేక వార్తలు వస్తున్నాయి.

అయిన కూడా మూవీ యూనిట్ మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ఇకపోతే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయినా నా సామి రంగ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇలా మంచి విజయం తర్వాత కూడా నాగార్జున తన తదుపరి మూవీ ని ఓకే చేయడంలో చాలా లేట్ చేస్తున్నాడు. నా స్వామి రంగా సినిమా విడుదల అయ్యి ఇప్పటికే ఆరు నెలలు గడుస్తున్నా నాగ్ ఏ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అలాగే తన తదుపరి మూవీ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. దానితో ఈ ఇద్దరు సీనియర్ హీరోల అభిమానులు ఎందుకు వీరు ఇలా చేస్తున్నారు అనే అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: