పవన్ సినిమాలో కేజిఎఫ్ బ్యూటీ.. ఏకంగా అలాంటి పాత్రలో?

praveen
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ మూవీ ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. ఎందుకు గుర్తుండదు అది మర్చిపోయే సినిమానా అంటారు సినీ ప్రేక్షకులు. ఎందుకంటే ప్రశాంత్ లాంటి ఒక సాదాసీదా డైరెక్టర్ ను ఏకంగా పాన్ ఇండియా డైరెక్టర్గా మార్చేస్తుంది ఈ మూవీ. అంతేకాదు కేవలం కోలీవుడ్ లో మాత్రమే తెలిసిన హీరో యష్ ను ఇక దేశవ్యాప్తంగా తెలిసేలా చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఇక ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.

 ఇక ఇప్పటికీ టీవీలలో ఈ సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు అందరూ కూడా టీవీకి అతుక్కుపోయి మరి సినిమా చూస్తూ ఉంటారు. అంతలా ఇక ఈ మూవీ ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఈ మూవీలో హీరోయిన్గా నటించింది శ్రీనిధి శెట్టి. తన అందం అభినయంతో ఎంతలా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కేజిఎఫ్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో శ్రీనిధి శెట్టి ఎన్నో అవకాశాలను కూడా దక్కించుకుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇప్పుడు ఈ కేజిఎఫ్ బ్యూటీ మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసింది అన్నది తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు అనే సినిమాలో శ్రీనిధి శెట్టి ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ స్పెషల్ సాంగ్ కోసం శ్రీనిధి శెట్టిని సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పేసిందట. మొన్నటి వరకు ఎలక్షన్స్ తో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈనెల 25వ తేదీ నుంచి హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొనబోతున్నారట. 20 నుంచి 25 రోజుల పాటు షూటింగ్లో పాల్గొంటే ఇక సినిమాను పూర్తి చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఇకపోతే శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ లో నటిస్తుందా లేదా అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: