షాకింగ్ : 'కల్కి' షో.. అక్కడ ఆపేసారు?

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన కూడా ఒకే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. అదే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి మూవీ గురించి. మైథాలజీ అనే కాన్సెప్ట్ కు సైన్స్ ఫిక్షన్, ఫ్యూచరిస్టిక్ జోడించి ఏకంగా ప్రేక్షకులందరికీ కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లగలిగాడు. హాలీవుడ్ రేంజ్ లో సినిమాను తెరకేక్కించి ప్రేక్షకులందరికీ కూడా మంత్రముగ్ధుల్ని చేసాడు. దీంతో మొదటి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. అయితే ఇటీవలే కమలహాసన్ భారతీయుడు 2 సినిమా విడుదలైన తర్వాత కల్కి మూవీ కలెక్షన్స్ తగ్గుతాయని అందరూ అనుకున్నారు.

 కానీ భారతీయుడు 2 యావరేజ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఇంకా కల్కి సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు సృష్టించిన రికార్డులను తిరగరాస్తు కల్కి మూవీ దూసుకుపోతుంది. ఇక మూవీ వసూళ్ల సునామీని ఆపేందుకు ఏ సినిమా కూడా అడ్డు లేకపోవడంతో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతుంది కల్కి సినిమా. అయితే ఇక ఇప్పుడు కల్కి మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. హైదరాబాదులోని ఓ థియేటర్లో కల్కి మూవీ ప్రదర్శనను నిలిపివేశారు.

 హైదరాబాద్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పంజాగుట్ట పివిఆర్ మాల్ లో కల్కి సినిమా వీక్షించడానికి వచ్చినవారికి చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఇది కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. థియేటర్ లోపల వర్షపు నీరు పడుతుండడంతో యాజమాన్యం వెంటనే సినిమా ప్రదర్శన ఆపేశారు. దీంతో టికెట్ కొనుక్కొని సినిమా చూడటానికి ఎంతో ఆశగా వెళ్లిన ప్రేక్షకులు అందరూ.. తీవ్ర అసహనానికి లోనయ్యారు. అసలు థియేటర్లో వర్షపు నీరు పడుతుండటం ఏమిటి.. నిర్వాహకులు షో నిలిపివేయడం ఏమిటి అంటూ నేటిజెన్లు సైతం ఫైర్ అవుతున్నారు. అయితే ఇలా వర్షపు నీరు లీక్ కావడం కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉందని అందుకే వెంటనే షో నిలిపివేసాము అంటూ యాజమాన్యం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: