రాజమౌళికి ఉన్న ఆ బలాన్ని మిస్ అవుతున్న శంకర్ !
‘రోబో’ సినిమా వరకు ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుడుగా కొనసాగిన శంకర్ తన ప్రాభవాన్ని కోల్పోవడం వెనుక ఒక ఆసక్తికర విషయం బయటపడుతోంది. శంకర్ గతంలో దర్శకత్వం వహించీ బ్లాక్ బష్టర్ హిట్స్ అందుకున్న ‘భారతీయుడు’ ‘ఒకేఒక్కడు’ ‘బాయ్స్’ ‘అపరిచితుడు’ ‘శివాజీ’ ‘రోబో’ సినిమాలు వరసపెట్టి బ్లాకష్టర్ హిట్స్ అవ్వడంతో శంకర్ పేరు మారుమ్రోగి పోయింది.
ఇలా శంకర్ పేరు మారుమ్రోగడం వెనుక తమిళ రచయిత సుజాత హస్తం ఉంది అన్న ప్రచారం ఉంది. తమిళ రచయిత అయిన అసలు పేరు ఎస్. రంగరాజన్. తమిళంలో సుమారు 100 నవలల వరకు వ్రాసిన ఈ రచయితకు తమిళ భాషలో మంచి గుర్తింపు ఉంది. శంకర్ తో ఈ రచయిత ప్రయాణం ‘భారతీయుడు’ మూవీ నుండి మొదలైంది.
ఆతరువాత శంకర్ తాను తీసిన రోబో వరకు ఈ రచయిత తోనే కథలు వ్రాయించాడు. వృత్తి రీత్యా ఇంజనీర్ అయిన సుజాత కు మానవ సంబంధాల లోని భావోద్వేగాలను అందరికీ నచ్చే విధంగా కథ కింద మాలచడంతో విపరీతమైన అనుభవం ఉంది దీనికితోడు టెక్నాలజీ విషయాయంలో కూడ ఈ రచయితకు చాల అవగాహన ఉండటంతో మానవ సంబంధాలను టెక్నాలజీ ముడిపెట్టి అయితే రోబో విడుదలైన కొంత కాలనికి రచయిత సుజాత మరణించిన తరువాత శంకర్ తీసిన ‘రోబో 2’ నుండి దర్శకుడుగా అతడి పతనం మొదలైంది. ఆతరువాత దర్శకుడు శంకర్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అతడు తీసిన ఏఒక్క సినిమా విజయవంతం కావడంలేడు. అయితే దీనికి భిన్నంగా రాజమౌళి తాను తీస్తున్న ప్రతీ సినిమాకు తన తండ్రి విజయేంద్ర ప్రసాదు అందిస్తున్న కథల సపోర్ట్ తో ఆస్కార్ అవార్డుల స్థాయికి ఎదిగిపోయాడు..