కేవలం బిగ్ బాస్ అందుకే చేశా.. అలాంటి కామెంట్స్ తో వైరల్ గా మారిన రవికృష్ణ..?

Pulgam Srinivas
కెరియర్ ప్రారంభంలో సీరియల్స్ లో నటించి ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో రవి కృష్ణ ఒకరు. ఇకపోతే ఈయన బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈయనకు బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాక సినిమాలలో వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈయన అనేక సినిమాలలో నటించాడు. కొంత కాలం క్రితం ఈ నటుడు బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విరూపాక్ష సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు.

ఈ మూవీ ద్వారా రవి కృష్ణ కి మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే కొంత కాలం క్రితం విడుదల అయిన లవ్ మీ అనే సినిమాలో కూడా ఈయన ముఖ్య పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు కానీ ఈ నటుడు మాత్రం తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. తాజాగా ఈయన బర్త్ డే బాయ్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా జూలై 19 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ లో ముఖ్య పాత్రలో నటించిన రవి కృష్ణ వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ వస్తున్నాడు.

అందులో భాగంగా తాజా ఇంటర్వ్యూలో ఈయన బిగ్ బాస్ చేయడానికి గల కారణాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా రవి కృష్ణ మాట్లాడుతూ ... సినిమాల్లో యాక్ట్ చేయడమే నా అతి పెద్ద గోల్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చా. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోవడంతో వచ్చిన అన్ని అవకాశాలను యూస్ చేసుకుంటూ కెరియర్ ను ముందుకు సాగించాను. ఇక సినిమాల్లో అవకాశం కోసమే బిగ్ బాస్ , సీరియల్స్ లో కనిపించాను. బిగ్ బాస్ తర్వాత నుండి సినిమాలపై దృష్టి పెట్టాను అని రవి కృష్ణ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: